వకీల్‌ సాబ్‌: ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే!

Pawan Kalyan Vakeel Saab Releasing On Amazon Prime: Check Release Date - Sakshi

మూడేళ్ల గ్యాప్‌ తర్వాత వకీల్‌ సాబ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌. ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క అన్నట్లుగా పలు సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ చేస్తూ చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడీ హీరో. అభిమానులను ఏమాత్రం నిరాశపర్చకుండా ఏడాదికి ఒకటీ రెండు సినిమాలైనా రిలీజ్‌ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడట పవన్‌. మూస ధోరణిలో ఉన్న పాత్రలను కాకుండా విభిన్నంగా ఉండేవాటికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా వుంటే శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహించిన 'వకీల్‌ సాబ్'‌ ఏప్రిల్‌ 9న థియేటర్లలో రిలీజైంది. దీన్ని అంత త్వరగా ఓటీటీలో ప్రసారం చేయొద్దని అనుకున్నారు. కలెక్షన్లు కూడా ఓ రేంజ్‌లో రావడంతో అందులో పవన్‌ వాటా సైతం తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఇదిలా వుంటే ఇప్పుడు థియేటర్లు మూత పడటంతో ఈ సినిమాను ఓటీటీలో ప్రసారం చేసేందుకు డీల్‌ కుదుర్చుకున్నారు. ఈ నెల 30 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో దీన్ని స్ట్రీమింగ్‌ చేయనున్నారు. ఈ మేరకు స్పెషల్‌ ప్రోమోను సైతం రిలీజ్‌ చేశారు.

చదవండి: వకీల్‌ సాబ్‌ సినిమా డైలాగ్‌ రైటర్‌ మన ఊరి అల్లుడే..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top