ఓటీటీలో 'ఫైనల్ డెస్టినేషన్' చూడాలంటే.. | Final Destination Bloodlines Movie OTT Streaming Details | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'ఫైనల్ డెస్టినేషన్' చూడాలంటే..

Jun 17 2025 12:18 PM | Updated on Jun 17 2025 12:32 PM

Final Destination Bloodlines Movie OTT Streaming Details

హాలీవుడ్‌లో 'ఫైనల్ డెస్టినేషన్' ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన సినిమాలకు తెలుగులో భారీ క్రేజ్‌ ఉంది. తాజాగా ఈ సీక్వెల్‌ చిత్రాల నుంచి విడుదలైన కొత్త చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులో కూడా స్ట్రీమింగ్‌ అవుతుంది.  అ‍ప్పట్లో అందరినీ ఈ సీక్వెల్స్‌ చిత్రాలు వణికించాయని చెప్పవచ్చు. అయితే, సుమారు 15 ఏళ్ల తర్వాత 'ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్' పేరుతో ఆరో భాగమైన చివరి పార్ట్ ని తీశారు. మే 15న భారత్‌లో విడుదలైంది. ప్రేక్షకులను థియేటర​్‌లో భయపెట్టిన ఈ చిత్రం సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.

ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ సడెన్‌గా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతుంది. కానీ, ప్రస్తుతం భారత్‌ నెట్‌వర్క్‌లో అందుబాటులో లేదు. ఇతర దేశాల్లో ఉంటున్న ఈమెజాన్‌ ప్రైమ్‌ యూజర్స్‌కు మాత్రమే  ఈ చిత్రాన్ని చూసే ఛాన్స్‌ ఉంది. అయితే, మరో వారంలోనే భారత్‌లో కూడా స్ట్రీమింగ్‌కు రావచ్చని తెలుస్తోంది. రూ. 430 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ. 2300 కోట్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.  జాక్ లిపోవ్స్కీ, అడమ్ స్టేయిన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సుమారు గంట 49 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ చిత్రంలో     బ్రెక్ బసింగర్, విలియమ్ బ్లడ్‌వర్త్, రిచర్డ్ హార్మోన్, క్యాథలీన్ శాంటా జువానా, టియో బ్రియోన్స్   తదితరులు నటించారు. 2000లో తొలి పార్ట్ రాగా.. 2003, 2006, 2009, 2011లో మిగతా పార్ట్స్ వచ్చాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆరోది రిలీజ్ అయింది.

Advertisement
 
Advertisement
Advertisement