పవన్‌ కల్యాణ్, రానా యాక్షన్‌

Pawan Kalyan-Rana Daggubati film goes on the floor - Sakshi

పవన్‌ కల్యాణ్, రానా కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఈ నెల 25న ఆరంభమైంది. సాగర్‌ కె.చంద్ర దర్శకుడు. ముందు పవన్‌ కల్యాణ్‌ చిత్రీకరణలో జాయిన్‌ అయ్యారు. ఆయన పాల్గొనగా ఫైట్‌ మాస్టర్‌ దిలీప్‌ సుబ్బరాయన్‌ నేతృత్వంలో యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గురువారం రానా కూడా ఈ షూట్‌లో జాయిన్‌ అయ్యారు. పవన్‌ కల్యాణ్, రానా కాంబినేషన్‌లో యాక్షన్‌ సీన్స్‌ తెరకెక్కిస్తున్నారు. పది రోజుల పాటు హైదరాబాద్‌లో ఈ చిత్రీకరణ జరుగుతుంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్‌ స్క్రీన్‌ ప్లే– సంభాషణలు అందిస్తున్నారు. సముద్ర ఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: ప్రసాద్‌ మూరెళ్ళ.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top