నేనెప్పుడూ అలా ఫీల్‌ కాలేదు.. రాత్రికి రాత్రే ఏమీ జరగలేదు, ఏడేళ్లుగా.. | Sakshi
Sakshi News home page

నేనెప్పుడూ అలా ఫీల్‌ కాలేదు.. రాత్రికి రాత్రే ఏమీ జరగలేదు, ఏడేళ్లుగా..

Published Mon, Aug 1 2022 12:39 AM

No limits, Every language is equally important says Rashmika Mandanna - Sakshi

‘ఓ నటిగా భాషాపరమైన హద్దులను నేనెప్పుడూ ఫీల్‌ కాలేదు’ అంటున్నారు హీరోయిన్‌ రష్మికా మందన్నా. ఈ విషయం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ– ‘‘రాత్రికి రాత్రే నాకు సక్సెస్‌ రాలేదు. ఏడేళ్లుగా ఎంతో కష్టపడుతున్నాను. ప్రాంతం, భాష ఆధారంగా కొందరు సినిమాను విభజించి చూస్తారు. కానీ నటిగా నాకు యాక్టింగ్‌ క్రాఫ్ట్‌పై పట్టు ఉన్నప్పుడు నా భావోద్వేగాలు ప్రేక్షకులకు అర్థం అయ్యేలా నటించడానికి భాష హద్దు కాదని భావిస్తాను.

వివిధ భాషల్లో సినిమాలు చేసే అవకాశం లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కరోనా కారణంగా ఆగిపోయిన నా ప్రాజెక్ట్స్‌ను కంప్లీట్‌ చేసే పనిలో ఉన్నాను. వచ్చే ఏడాది ఈ సినిమాలు ఎక్కువగా రిలీజ్‌ అయ్యే అవకాశాలున్నాయి. చాలా ఎగై్జటెడ్‌గా ఉన్నాను’’ అన్నారు. కాగా రష్మికా మందన్నా నటించిన హిందీ చిత్రాలు ‘గుడ్‌ బై’, ‘మిషన్‌ మజ్ను’ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ప్రస్తుతం ‘వారసుడు’, ‘యానిమల్‌’ చిత్రాలతో బిజీగా ఉన్నారు రష్మిక.  

Advertisement
 
Advertisement