ఎట్టకేలకు కొత్త సినిమా మొదలుపెట్టిన నితిన్ | Nithiin New Movie Launch And Full Details | Sakshi
Sakshi News home page

Nithiin New Movie: ఏడాది గ్యాప్ తర్వాత కొత్త మూవీ లాంచ్

May 6 2026 2:44 PM | Updated on May 6 2026 2:59 PM

Nithiin New Movie Launch And Full Details

2020లో వచ్చిన 'భీష్మ' తర్వాత సినిమాలైతే చేస్తున్నాడు గానీ హిట్ అనేది నితిన్‌కి దక్కట్లేదు. గతేడాది వచ్చిన 'తమ్ముడు' మూవీ ఘోరమైన డిజాస్టర్ అయ్యేసరికి లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ హీరో.. ఎట్టకేలకు కొత్త చిత్రాన్ని అధికారికంగా లాంచ్ చేశాడు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమంతో ఈ ప్రాజెక్ట్ మొదలైంది.

(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి జ్యోతిక కోర్ట్ రూమ్ సినిమా)

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుండగా.. నారి-సోము దర్శకులుగా పరిచయమవుతున్నారు. నితిన్ సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా చేస్తోంది. సురేష్ బొబ్బిలి సంగీతమందిస్తున్నాడు. ఈ నెల రెండో వారం నుంచి షూటింగ్ మొదలవనుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

(ఇదీ చదవండి: మృణాల్ ఠాకుర్‌కి ఊహించని అవకాశం?)

Advertisement
 
Advertisement
Advertisement