ఓటీటీలో నితిన్‌ 'చెక్‌': ఏ రోజు నుంచంటే?

Nithiin Check Movie OTT Release Date Confirmed: Streaming On SUN NXT - Sakshi

గతేడాది భీష్మతో హిట్టు కొట్టిన యంగ్‌ హీరో నితిన్‌ ఈ ఏడాది చెక్‌తో అభిమానుల ముందుకొచ్చాడు. కానీ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ యేలేటి అందించిన డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ జనాలకు కొత్తదనాన్ని పంచింది. బాక్సాఫీస్‌ దగ్గర పెద్దగా వసూళ్లు కురిపించనప్పటికీ మంచి ప్రశంసలైతే దక్కాయి. ఫిబ్రవరి 26న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో రిలీజ్‌ అవుతోంది. మే 14 నుంచి సన్‌ నెక్స్ట్‌లో ప్రసారం కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. 

తన తెలివితేటలతో చిన్నచిన్న దొంగతనాలు చేసే హీరో ఉగ్రదాడి కేసులో ఎలా ఇరుక్కున్నాడనేది కథ. కాగా ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరో ప్రేయసిగా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ న్యాయవాదిగా నటించారు. సంపత్‌ రాజ్‌, సాయిచంద్‌, పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ ముఖ్య పాత్రల్లో కనిపించారు. భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌పై వి. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించాడు. కల్యాణీ మాలిక్‌ సంగీతం అందించాడు. ఏదేమైనా కోవిడ్‌ భయంతో థియేటర్‌లో చూడలేని వాళ్లు, లేదా ఇంకోసారి చూడాలనుకునేవాళ్లు ఇప్పుడు హాయిగా ఇంట్లోనే సన్‌ నెక్స్ట్‌ యాప్‌లో చూసేయొచ్చు.

చదవండి: ‘చెక్‌’ మూవీ రివ్యూ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top