ఇండియన్‌ ఐడల్‌ 12: హోస్ట్‌ ఆదిత్య నారాయణ తీరుపై నెటిజన్లు ఫైర్‌

Netizens Troll Indian Idol Host Aditya Narayan Over His Comments On Contestants - Sakshi

ఇండియల్‌ ఐడల్‌ 12 షోలో గత వారం సింగర్‌, టీవీ హోస్ట్‌ ఆదిత్య నారాయణ తీరుపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆదిత్య ఇండియన్‌ ఐడల్‌ 12కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎపిసోడ్‌లో అతడు సింగర్‌ కుమార్‌ సనుతో చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆదిత్యను ట్రోల్‌ చేస్తున్నారు. గత వారం జరిగిన ఎపిసోడ్‌లో ఇటీవల మృతి చెందిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ శ్రవన్‌ రాథోడ్‌కు నివాళులు అర్పించారు.  

ఈ సందర్భంగా ఆయన సన్నిహితులు, ప్రముఖ గాయకులు  కుమార్‌ సను, అనురాధ పౌడ్వాల్‌, రూప్‌ కుమార్‌ రాథోడ్‌ ఈ షోకు అతిథులుగా హజరయ్యారు. ఈ నేపథ్యంలో  హోస్ట్‌ ఆదిత్య, కుమార్‌ సనుతో నిజంగానే మీరు కంటెస్టెంట్స్‌ పర్ఫామెన్స్‌ నచ్చి వారిని ప్రశంసించారా, లేక షో మేకర్స్‌ చెప్తే చేశారా అని షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. వెంటనే ఆదిత్య సింగర్‌ సను ‘వాళ్లు నిజంగానే మంచి గాయకులు. కంటెస్టెంట్స్‌ అంత అద్భుతమైన పాటగాళ్లు. ఒక రీయాలిటి షోలో ఇంతమంది ప్రతిభవంతులైన సింగర్స్‌ను ఇంతవరకు నేనేప్పుడు చూడలేదు. ఇప్పటికిప్పుడు వీరంత ప్లేబ్యాక్‌ సింగర్స్‌ కావోచ్చు. ఒక్కొక్కరు ఒక్క రత్నం’ అంటూ ఆయన కంటెస్టెంట్స్‌ను కొనియాడారు.

అనంతరం ఆదిత్య వ్యాఖ్యలను తప్పు బడుతూ ‘ఎంతో మంది గెస్టులను ఈ షోకు ఆహ్వానించిన ఆదిత్య తీరు బాధాకరం, ఇలాంటి వ్యాఖ్యలు చేసేముందు గాయకులు అర్జీత్‌ సింగ్‌, ఆర్మాన్‌ మాలిక్‌లు ఈ స్టేజ్‌ ద్వారానే ప్రపంచానికి పరిచయమయ్యారనే విషయం అతడు గుర్తుపెట్టుకోవాలి’ అంటూ సోని వారు ఈ వీడియోను షేర్‌ చేశారు. అది చూసిన నెటిజన్లు ఆదిత్యను ‘షో నుంచి తీసేయండి’, ‘అతడు లెజండరీ సింగర్స్‌ను అవమానించాడు’, ఆదిత్య అమిత్‌ కుమార్‌ వ్యాఖలతో ఇలా వ్యవహరించడం సరికాదు’ అంటు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా గత ఎపిసోడ్‌లో కిషోర్‌ కుమార్‌, ఆయన తనయుడు అమిత్‌ కుమార్‌ అతిథులగా వచ్చారు.ఈ షో చివరలో సింగర్‌ అమిత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. తనకు కంటెస్టంట్స్‌ పర్ఫామెన్స్‌ నచ్చిన నచ్చకపోయిన వారిని ప్రశంసించమని షో నిర్వహకులు కోరారని, వారి పాటలు నచ్చకపోతే ఎలా పాజిటివ్ కామెంట్స్‌ ఇస్తామని ఆయన మండిపడిన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top