'నీతో' మూవీ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్.. | Neetho Movie Lyrical Song Released Today | Sakshi
Sakshi News home page

Neetho Movie Lyrical Song: 'లలనా మధుర కలనా' లిరికల్ వీడియో సాంగ్ విడుదల

Published Mon, Oct 3 2022 9:33 PM | Last Updated on Mon, Oct 3 2022 9:36 PM

Neetho Movie Lyrical Song Released Today - Sakshi

అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ జంటగా నటించిన చిత్రం "నీతో". ఈ చిత్రానికి బాలు శర్మ దర్శకత్వం వహించగా.. పృధ్వి క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి "లలనా మధుర కలనా" అనే లిరికల్ సాంగ్ విడుదల చేసింది చిత్రబృందం.  వరుణ్ వంశి రచించిన ఈ పాటను హరిహరణ్ ఆలపించారు. ఇప్పటికే ఈ పాటకు అనూహ్య స్పందన లభిస్తోంది.    

ఇప్పటికే రిలీజైన ఈ చిత్ర ట్రైలర్ కు అనూహ్య స్పందన  లభించింది. 'మనకు రిలేషన్ షిప్ ఎలా ఎండ్  అయిందో  గుర్తుంటుంది కానీ.. ఎలా స్టార్ట్  అవుతుందో గుర్తురాదు" లాంటి యూత్  కనెక్ట్ అయ్యే డైలాగ్స్ ఉన్నాయి. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement