అమ్మోరు త‌ల్లి: ట‌్రైల‌ర్ రిలీజ్ చేసిన మ‌హేశ్‌

Nayanthara Movie Ammoru Thalli Trailer Is Out - Sakshi

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ఆదిశ‌క్తిగా క‌నిపిస్తున్న చిత్రం ముక్తి అమ్మాన్‌. ఎప్పుడూ అందం, అభిన‌యంతో అల‌రించే ఆమె తొలిసారి దేవ‌త పాత్ర‌లో ద‌ర్శ‌నమివ్వ‌నున్నారు. ఈ చిత్రం తెలుగులో అమ్మోరుత‌ల్లిగా విడుద‌ల కానుంది. ఎన్‌జె శ‌రవ‌ణ‌న్‌, ఆర్జే బాలాజీ‌ దర్శకత్వం వహించారు. ఇశారి కె గ‌ణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గిరీశ్ సంగీతం స‌మ‌కూర్చారు. ద‌స‌రా సంద‌ర్భంగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను హీరో మ‌హేశ్‌బాబు విడుద‌ల చేశారు. (ఫ్యాక్ట్‌‌ : నయన్‌-విఘ్నేశ్‌లకు కరోనా సోకిందా?)

ఓ కుటుంబ కుల‌దైవమైన‌ ముక్కుపుడ‌క‌ల అమ్మ‌వారు వారి ఎదుట ప్ర‌త్య‌క్ష‌మై ఎలాంటి వ‌రాలు ఇచ్చారు? భ‌క్తి పేరుతో మోసాలు చేసేవారిని అమ్మ‌వారు ఏం చేశారు? అస‌లు అమ్మ‌వారు భూమి మీద‌కు రావ‌డానికి కార‌ణ‌మేంటి? ఆమె నిజంగా అమ్మ‌వారేనా> అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  తాజాగా రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌లో 'మీ జుట్టు ఎంద‌కు న‌ల్ల‌గా లేకుండా ఫారిన్ అమ్మోరిలా గోధుమ రంగులో ఉందని ఓ భ‌క్తుడు అడిగిన ప్ర‌శ్న‌కు అడ్డ‌మైన నీళ్ల‌తో అభిషేకాలు చేస్తే క‌ల‌ర్ మార‌దా? అని న‌య‌న్ కౌంట‌రిచ్చారు. మీ శ‌క్తినుప‌యోగించి ఆన్‌లైన్ క్లాసులు ర‌ద్దు చేయ‌మ‌ని ఓ భక్తురాలు కోర‌డంతో అమ్మోరు త‌ల్లే షాక‌య్యారు. వినోదంతో పాటు మంచి సందేశాన్ని అందించేందుకు సిద్ధ‌మవుతున్న ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 14న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుద‌ల కానుంది. (నిల‌క‌డ‌గా హీరో రాజశేఖర్ ఆరోగ్యం)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top