హాయ్‌ నాన్న | Nani, Mrunal Thakur film titled Hi Nanna | Sakshi
Sakshi News home page

హాయ్‌ నాన్న

Published Fri, Jul 14 2023 4:04 AM | Last Updated on Fri, Jul 14 2023 4:04 AM

Nani, Mrunal Thakur film titled Hi Nanna - Sakshi

నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘హాయ్‌ నాన్న’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. శౌర్యువ్‌ దర్శకత్వంలో మోహన్‌ చెరుకూరి (సీవీఎం), డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌.

ఈ చిత్రానికి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘హాయ్‌ నాన్న’ అని, హిందీలో ‘హాయ్‌ పప్పా’ అనే టైటిల్‌ను ఖరారు చేసి, ఫస్ట్‌ లుక్, గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘‘తండ్రీ–కూతురు భావోద్వేగాలతో కూడిన ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. యూనిక్‌ స్టోరీ లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రం అన్ని భాషలవారికీ కనెక్ట్‌ అవుతుంది. ఈ ఏడాది డిసెంబర్‌ 21న చిత్రాన్ని రిలీజ్‌ చేస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement