అతిథి ఆన్‌ సెట్‌ | Nandamuri Balakrishna who made noise on Venky Anil movie sets | Sakshi
Sakshi News home page

అతిథి ఆన్‌ సెట్‌

Sep 22 2024 12:29 AM | Updated on Sep 22 2024 12:29 AM

Nandamuri Balakrishna who made noise on Venky Anil movie sets

వెంకటేశ్‌ సినిమా సెట్స్‌లో సందడి చేశారు బాలకృష్ణ. హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌). మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ట్రైయాంగిల్‌ క్రైమ్‌ డ్రామా చిత్రాన్ని ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఇటీవలే పొల్లాచ్చిలో ఈ సినిమాకు చెందిన ఓ కీలక షెడ్యూల్‌ చిత్రీకరణ ముగిసింది.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో షూటింగ్‌ జరుగుతోంది. ఈ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టారు బాలకృష్ణ. ఈ అతిథి తమ సెట్‌కి రావడంతో యూనిట్‌ సంబరపడిపోయింది. ఈ సందర్భంగా క్లిక్‌మనిపించిన ఫొటోలను షేర్‌ చేసింది చిత్రబృందం. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ చేయడానికి చిత్రయూనిట్‌ రెడీ అవుతోంది. ఈ సినిమాకు భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement