
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు అరుదైన గౌరవం దక్కింది. హీరోగా 50 ఏళ్లకుపైగా నటిస్తున్నందుకు ఆయనకు గుర్తింపు అందింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బాలయ్య చేరారు. గోల్డ్ ఎడిషన్‌లో ఆయన పేరును యూకే సంస్థ చేర్చింది. భారతీయ చలన చిత్ర చరిత్రలో ఈ అవార్డ్‌కు ఎంపికైన తొలి నటుడిగా రికార్డ్ క్రియేట్ చేశారు. 1974లో తాతమ్మకల చిత్రం ద్వారా ఆయన వెండితెరకు పరిచయం అయ్యారు. ఇదే ఏడాది బాలకృష్ణకు భారత ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత మూడో పురస్కారం పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. తాజాగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బాలయ్య చేరడంతో హైదరాబాద్‌లో ఈ నెల 30న ఆయన్ను సత్కరించనున్నారు.