Unstoppable With NBK: మాటలతో వాళ్లను ట్విస్ట్ చేస్తా..

Nandamuri Balakrishna: 'మనిషి ప్రజెంటేషనే అన్‌స్టాపబుల్. నవ్వడం, నవ్వించడమే యాక్టింగ్ కాదు, పాత్రలోకి ప్రవేశించడం. అది ఎంతో ఒత్తిడితో కూడుకుంది. ఇక ప్రతి ఇండస్ట్రీలో పోటీ ఉంటుంది. పోటీ ఉన్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. బావిలో కప్పలా ఉండకుండా బయటకు వచ్చినప్పుడే అసలు మనిషి ఆవిష్కరించబడతాడు. అలా ఆవిష్కరించే ప్రయత్నమే అన్‌స్టాపబుల్. ప్రతి మనిషికీ జీవితంలో ఒక ప్రయాణం ఉంటుంది. వాటిని అధిగమించి లక్ష్యాన్ని చేరడమే అన్‌స్టాపబుల్. ఇది నాకు నచ్చింది. అందుకే ఒప్పుకున్నా. ఈ కార్యక్రమానికి వచ్చే నటీనటులతో కలిసి మాట్లాడతా. మాటలతో వాళ్లను ట్విస్ట్ చేస్తా. ఆహాలో అన్‌స్టాపబుల్‌లో కలుద్దాం' అన్నారు బాలకృష్ణ. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న కార్యక్రమం ‘అన్‌స్టాపబుల్’ నవంబరు 4వ తేదీ నుంచి ఓటీటీ ఆహాలో ప్రసారం కానుంది. గురువారం ఈ కార్యక్రమం కర్టెన్ రైజర్ జరిగింది.
Aha lo kaludhaam ani mana balayya garu annarante history repeat avvatam khayam!🔥#UnstoppableWithNBK#NBKonAHA. pic.twitter.com/8fqiqLnMYV
— ahavideoIN (@ahavideoIN) October 14, 2021
ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘బాలకృష్ణ వెండితెరపై నటుడేమో కానీ, నిజ జీవితంలో కాదు. భావోద్వేగాలను దాచుకోరు. అలాంటి వ్యక్తి వ్యాఖ్యాతగా ‘అన్‌స్టాపబుల్’ చేయడం నిజంగా ఆనందంగా ఉంది. ఒకరోజు ‘ఆహా’ టీమ్‌తో కలిసి ఏదో మాట్లాడుతూ.. ‘బాలకృష్ణతో షో చేస్తే ఎలా ఉంటుంది’ అని అన్నాను. అందరూ అరుపులు, ఈలలు వేశారు. మరో క్షణం ఆలోచించకుండా వెంటనే బాలకృష్ణకు ఫోన్ చేశా, ఆయన ఓకే అన్నారు. ఇక ఆహాకు 1.5మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఏడాది చివరి నాటికి 2 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ లక్ష్యం. పెద్ద పెద్ద సంస్థలు కూడా పొందలేని నెంబర్లు ‘ఆహా’కు వస్తున్నాయి. ఇది తెలుగువారి ఘనత. తెలుగువారి సినిమాలను దేశవ్యాప్తంగా చూస్తున్నారు. తెలుగు సినిమాకు దేశవ్యాప్తంగా ‘బాహుబలి’ ఎంతో గౌరవాన్ని తెచ్చింది. అలాంటి గౌరవాన్ని నిలబెట్టేందుకే ‘ఆహా’ కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా చెబుతున్నా’’ అని అన్నారు.