జర్నలిస్ట్‌గా నాగ చైతన్య.. వరుస హత్యలను ఎలా ఛేదించాడు | Watch: Naga Chaitanya Dhootha Web Series Official Trailer Released, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Dhootha Official Trailer: జర్నలిస్ట్‌గా నాగ చైతన్య.. వరుస హత్యలను ఎలా ఛేదించాడు

Published Thu, Nov 23 2023 12:38 PM

Naga Chaitanya Dhootha Web Series Official Trailer - Sakshi

అక్కినేని నాగచైతన్య నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ 'దూత' డిసెంబర్‌ 1 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. నేడు (నవంబర్‌ 23) చైతూ పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.  హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌కు విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించారు.  తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. 

 నాగచైతన్యతో 'మనం', 'థాంక్యూ' సినిమాలను డైరెక్ట్‌ చేసిన విక్రమ్‌ కె. కుమార్‌ తాజాగా దూత అనే  వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించారు. ఇందులో పార్వతీ తిరువోతు, ప్రియ భవానీ శంకర్‌, ప్రాచీ దేశాయ్‌, తరుణ్‌ భాస్కర్‌ ముఖ్య పాత్రలు పోషించారు.

తాజాగా విడుదలన ట్రైలర్‌ చాలా ఆసక్తికరంగా సాగింది. దూతలో నాగ చైతన్య జర్నలిస్ట్‌గా కనిపిస్తాడు. సమాచార్ అనే దినపత్రికలో సాగర్ అనే జర్నలిస్టుగా చైతూ నటించాడు. ఈ క్రమంలో నగరంలో జరిగే వరుస హత్యలకు న్యూస్‌ పేపర్లో వచ్చే కార్టూన్లకు సంబంధం ఉన్నట్లు ఆయన కనుగొంటాడు. హత్యల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు జర్నలిస్ట్‌గా చైతన్య చేసిన సాహాసాలు ఎలాంటివి..? ఈ క్రమంలో అతని మీదే నేరం ఎందుకు పడుతుంది..? చిక్కుల్లో పడిన ఒక జర్నలిస్ట్‌ ఎలా బయటపడ్డాడు అనేది తెలియాలంటే డిసెంబర్‌ 1న అమెజాన్‌లో చూడాల్సిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement