
ప్రయోగాలకు ప్రసిద్ధి గాంచిన సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్(A. R. Rahman ). 1992లో రోజా చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అయిన ఈయన తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించారు. స్లమ్ డాగ్ మిలీనియం చిత్రానికి గాను ఆస్కార్ అవార్డును గెలుచుకున్న ఈయనకు తమిళ భాషపై అమితమైన ప్రేమ. ఇంతకు ముందే సెంమ్మొళియన్ తమిళ్ మొళి పేరుతో ఆల్బమ్‌ను రూపొందించి ఖ్యాతి గడించారు.
తాజాగా మరో ప్రయోగానికి సిద్దం అయ్యారు. తమిళ భాష కోసం ఒక స్మారక చిహ్నాన్ని రూపొందించడానికి శ్రీకారం చుట్టారు. దీనికి ఏఆర్‌ఆర్ ఇమ్మర్‌సీవ్ ఎంటర్‌టెయిన్‌మెంట్ టీమ్ ముమ్మరంగా పని చేస్తున్నట్లు, డిజిటల్ రూపంలో ఉన్న ఈ తమిళ్ భాషా స్మారక చిహ్నాన్ని త్వరలోనే నిర్మించనున్నట్లు ఏఆర్.రెహ్మాన్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.