చీరలో రమ్మన్నాడు.. చెప్పుతో కొడతా అని చెప్పా: మిర్చి మాధవి | Mirchi Madhavi Opens Up About Her Casting Couch Experience In The Film Industry, Watch Video Inside | Sakshi
Sakshi News home page

ఆ డైరెక్టర్‌ ఇంటికి వచ్చాడు.. ‘చెప్పుతో కొడతా’ అని చెప్పా : మిర్చి మాధవి

May 31 2026 10:26 AM | Updated on May 31 2026 11:25 AM

Mirchi Madhavi Talk About Casting Couch

చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఓ చేదు వాస్తవం. అవకాశాల పేరుతో అమ్మాయిలను శారీరకంగా వాడుకుంటున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఒకప్పుడంటే భయంతో అలాంటి విషయాలు బయటకు చెప్పలేదు కానీ..ఇప్పుడు మాత్రం బహిరంగంగా మాట్లాడుతున్నారు. దురుసుగా ప్రవర్తిస్తే.. పోలీసుల ఫిర్యాదు వరకు వెళ్తున్నారు. అయినా కూడా ఇప్పటికీ క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉంది. అయితే ఇందులో  అమ్మాయిల తప్పు కూడా ఉంటుంది అంటోంది నటి మిర్చి మాధవి. స్వలాభం కోసం కొంతమంది అమ్మాయి అలాంటి పనులు చేస్తున్నారని చెబుతోంది. ఒకవైపు బుల్లితెర మరోవైపు వెండితెరపై క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న మాధవి.. తాజాగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్‌ కౌచ్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, తనకు ఎదురైన ఓ సంఘటన గురించి వెల్లడించింది.

ఇంటికి వచ్చాడు.. 
నా కెరీర్‌ ప్రారంభంలో ఒకటి రెండు సార్లు నేను కూడా క్యాస్టింగ్‌ కౌచ్‌కి గురయ్యాను. ఓ సారి డైరెక్టర్‌ని అని ఒకడు ఫోన్‌ చేశాడు. మెయిన్‌ లీడ్‌గా చేయాలి.. ఇంటికొచ్చి మాట్లాడతానన్నాడు. సరే రమ్మని చెప్పాను. అప్పుడు నేను దిల్‌సుఖ్‌ నగర్‌లో ఉండేదాన్ని. నా భర్త గచ్చిబౌలిలో ఉద్యోగం చేసేవాడు. రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చేవాడు. ఈ డైరెక్టర్‌ సాయంత్రం 4 గంటలకు మా ఇంటికి వచ్చాడు. అప్పుడు ఇంట్లో నేను, అమ్మ, ఇంకో అమ్మాయి మాత్రమే ఉన్నాం.

ఆడిషన్‌ చేస్తున్నాడేమో అనుకున్నా.. 
ఆయన వచ్చేసరిని నేను డ్రెస్‌లో ఉన్నాను. చీర కట్టుకొని రమ్మని చెప్పాడు. ఆడిషన్స్‌ కోసం కావొచ్చ అనుకొని.. చీరకట్టుకొని వచ్చి ఆయన ముందు నిలబడ్డా. కాసేపటి తర్వాత ఇది కాదు వేరే చీర మార్చుకొని రమ్మన్నాడు. ఓకే అని చెప్పి..మరో చీరలో వచ్చాడు. అతను అలా చూసి..కాస్త నీ నడుము చూపించు అన్నాడు. అప్పుడు అర్థం అయింది వాడు ఎందుకు వచ్చాడో. వెంటనే కోపంతో ‘లేరా.. చెప్పు తీసుకుని కొడతా, బయటకు పో’ అని గట్టిగా చెప్పా. వాడు భయపడి వెళ్లిపోయాడు.  ఒకవేళ వాడు తలుపేసి ఏమైనా చేసుంటే నా పరిస్థితి ఏంటి?  అని చాలా భయపడి పోయా. ఈ విషయం అమ్మకు చెబితే.. ‘వాడిని గదిలోనే ఉంచి తాళం వేయాల్సింది. పోలీసులకు ఫిర్యాదు చేసేదాన్ని’ అని చెప్పింది. నేనే ఎలాంటి ఫిర్యాదులు వద్దని చెప్పా’ ఇలాంటి చేదు ఘటనలు ఒకటి రెండు సార్లు జరిగాయి’ అని మాధవి చెప్పుకొచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement