
మెదకు చిత్రం 2021లో విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇది శ్రీలంక ప్రభుత్వాన్ని గడగడలాడించిన ప్రభాకర్ ఇతివృత్తంతో రూపొందిన చిత్రం. అక్కడ తమిళులను ఎలా హింసించారు..? వాటిని తమిళులు ఎలా ఎదుర్కొన్నారు అనే ఇతి వృత్తంతో నిర్మించిన చిత్రం మెదకు. తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా మెదకు– 2ను రూపొందించారు. ఈ చిత్రాన్ని తంజావూరుకు చెందిన తంజైగుహన్, ఐర్లాండ్‌లో నివసిస్తున్న కవి తిరుకుమరన్, డెన్మార్క్‌కు చెందిన సురేష్ కుమార్ కలిసి నిర్మించారు. ఇందులో కెప్టెన్ ప్రభాకర్‌గా గౌరీ శంకర్ నటించగా, అతిథి పాత్రలో నాజర్ నటించారు. ఆర్కే యోగేంద్రన్ దర్శకత్వం వహింపొందించారు.
ఆర్కే యోగేంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 21 ఏళ్ల తర్వాత ప్రభాకర్ జీవిత చరిత్ర ఆవిష్కరించేదిగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. శ్రీలంకలో తమిళ ప్రజలకు జరిగిన అన్యాయాలు, హింసలు, వాటిని వారు ఎలా ఎదిరించారు? వంటి అనేక అంశాలను వాస్తవానికి దగ్గరగా తెర్కెక్కింనట్లు తెలిపారు. చిత్రాన్ని ఈనెల 19న విడుదల చేస్తామని ప్రకటించారు.