సిల్వర్‌ స్క్రీన్‌తో కంటే టీవీ స్క్రీన్‌తోనే..

Meher Vij Special Interview In Sakshi Funday

మెహెర్‌ విజ్‌..  ‘బజ్‌రంగీ భాయీజాన్‌’ సినిమా చూసినవాళ్లకు బాగా గుర్తు. అందులో ‘మున్నీ (హర్షాలి మెహెతా)’ వాళ్ల అమ్మ రజియాగా నటించింది. ఇంకా పోల్చుకోలేకపోతే ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’లో సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌ ఇన్సియా మాలిక్‌ (జైరా వసీమ్‌) తల్లి నజ్మా మాలిక్‌గా కనిపించిన నటి. సిల్వర్‌ స్క్రీన్‌తో కంటే టీవీ స్క్రీన్‌తోనే ఆమెకు అనుబంధం ఎక్కువ. సినిమాల్లో కంటే సీరియల్స్‌లోనే ప్రధాన పాత్రలు దొరికాయి. డిస్నీ హాట్‌స్టార్‌ సిరీస్‌ ‘స్పెషల్‌ ఆప్స్‌’తో వెబ్‌ వీక్షకులకూ ఫేవరెట్‌ స్టార్‌ అయింది మెహెర్‌ విజ్‌. 

  • పుట్టిపెరిగింది ఢిల్లీలో. ఆమె అసలు పేరు వైశాలి సహదేవ్‌. మెహెర్‌ కంటే ముందు ఆమె ఇద్దరన్నలు పీయూష్‌ సహదేవ్, గిరీశ్‌ సహదేవ్‌లు సినిమాల్లోకి వచ్చారు. ఆ నేపథ్యమే మెహెర్‌లో నటనాసక్తిని పెంచింది.
  • 2003లో ‘సాయా’ అనే సినిమాతో నటనా ప్రవేశం చేసింది మెహెర్‌. అందులో ఆమెది చాలా చిన్నపాత్ర. పెద్దగా గుర్తింపేమీ రాలేదు. 2005లో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా వచ్చిన ‘లక్కీ.. నో టైమ్‌ ఫర్‌ లవ్‌’లోనూ ఆమెకు అవకాశం వచ్చింది. అదీ ప్రేక్షకుల అటెన్షన్‌ను పొందలేకపోయింది.
  • 2006లో చిన్న తెర అవకాశాన్నీ జారవిడుచుకోలేదు. డీడీలో ‘స్త్రీ తేరీ కహానీ’, 2009,  స్టార్‌ప్లస్‌లో ప్రసారమైన ‘కిస్‌ దేశ్‌ మే హై మేరా దిల్‌’లో అభినయించి ప్రతింట్లో అభిమానులను సంపాదించుకుంది. ఇటు సినిమా ఇండస్ట్రీ దృష్టినీ ఆకర్షించింది. 
  • తర్వాత సినిమాలు, సీరియళ్లతో బిజీ అయిపోయింది మెహెర్‌. ‘రామ్‌ మిలాయీ జోడీ’ అనే సీరియల్‌లోనూ నటించింది. 2013లో ‘ది పైడ్‌ పైపర్‌’ అనే షార్ట్‌ ఫిల్మ్‌లో ప్రధాన భూమికలో జీవించింది. ఈ లఘుచిత్రం పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమై.. మెహర్‌ విజ్‌ను ప్రపంచానికి చూపించింది.
  • బాలీవుడ్‌లో ఆమెకు బ్రేక్‌ త్రూ అంటే బజ్‌రంగీ భాయీజాన్‌ అనే చెప్పాలి.  
  • 2013లో బిందాస్‌ వెబ్‌ చానెల్‌లో ‘యే హై ఆషికీ’తో వెబ్‌ సిరీస్‌ ఎంట్రీ ఇచ్చింది మెహెర్‌.
  • ప్రయాణాలు, పుస్తక పఠనం, సంగీతాన్ని ఆస్వాదించడం ఆమెకు ఇష్టమైన వ్యాపకాలు. 
  • వైశాలి సహదేవ్‌ నుంచి మెహెర్‌ విజ్‌ ఎలా అయిందంటే... ఆమె నటించిన ‘కిస్‌ దేశ్‌ మే హై మేరా దిల్‌’ సీరియల్‌లో ఆమె పాత్ర పేరు మెహెర్‌. ఆ సీరియల్‌ చేస్తున్నప్పుడే సహనటుడు మానవ్‌ విజ్‌ (సినీ నటుడు కూడా)తో పరిచయం ప్రేమగా మారింది. సీరియల్‌ బయట కూడా మానవ్‌ ఆమెను ‘మెహెర్‌’ అంటూ ఆప్యాయంగా పిలిచేవాడు. మెహెర్‌ అంటే పంజాబీలో ఆశీస్సులు అని అర్థం. ‘నిజంగానే మెహెర్‌ నా లైఫ్‌లో ఆ దేవుడి బ్లెస్సింగ్‌’ అని చెప్పాడట ఒక ఇంటర్వ్యూలో మానవ్‌ విజ్‌.  దాంతో ఆ పేరునే తన స్క్రీన్‌ నేమ్‌గా ఖాయం చేసుకుంది మెహెర్‌. అన్నట్టు వాళ్ల ప్రేమ ఆ సీరియల్‌ షూటింగ్‌లో ఉండగానే పెళ్లితో స్థిరపడింది.  ఇండస్ట్రీలో అత్యంత అన్యోన్యమైన జంటగా పేరూ తెచ్చిపెట్టింది. 
  • ‘పెళ్లి తర్వాత నటనకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు మానవ్‌. వృత్తిపరమైన విషయాల్లో ఒకరికొకరం జోక్యం చేసుకోం. ఒకరి స్పేస్‌ను ఒకరం గౌరవిస్తాం. మా లవ్‌ అండ్‌ హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌ సీక్రెట్‌ ఇదేనేమో మరి’ అంటుంది  మెహెర్‌ విజ్‌. 
Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top