సెంటిమెంట్‌.. యాక్షన్‌

Mega Power movie launch at hyderabad - Sakshi

శ్రీ కల్యాణ్, శశి జంటగా గేదెల రవిచంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మెగా పవర్‌’. అడబాల నాగబాబు, సాయినిర్మల, ఇల్లా అభిషేక్, సత్యమూర్తి గేదెల నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల హైదరాబాద్‌లో జరిగాయి.

హీరో కిరణ్‌ అబ్బవరం కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నటుడు రఘుబాబు క్లాప్‌ ఇచ్చారు. తొలి సన్నివేశానికి పృథ్వీరాజ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ– ‘‘మదర్‌ సెంటిమెంట్‌తో సాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది’’ అని అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top