విశాల్‌ నన్ను పెళ్లి చేసుకుంటా అన్నారు! | Meera Mithun Controversial Comments On Hero Vishal | Sakshi
Sakshi News home page

విశాల్‌ నన్ను పెళ్లి చేసుకుంటా అన్నారు!

Aug 20 2020 9:18 AM | Updated on Aug 20 2020 12:08 PM

Meera Mithun Controversial Comments On Hero Vishal - Sakshi

సాక్షి, చెన్నై : నటి మీరామిథున్‌ తన వివాదస్పద వ్యాఖ్యలకు బ్రేక్‌ వేసే ఆలోచనలో ఉన్నట్టు కనిపించడం లేదు. ఆ మధ్య  హీరోలు విజయ్, సూర్యలను వ్యక్తిగతంగా విమర్శలు చేసి వారి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. అంతేకాకుండా మీరామిథున్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను తీవ్రంగా హెచ్చరించారు. అయినా నటి మీరామిథున్‌లో ఏ మాత్రం మార్పు రాలేదు. 

ఇటీవలే రజనీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశం గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరో వివాదస్పద అంశానికి తెర తీశారు. ఈసారి విశాల్‌ను టార్గెట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాజీ మేనేజర్‌ విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అవుతోంది. అందులో విశాల్‌ తనను పెళ్లి చేసుకుంటానని రెండు, మూడు ఏళ్లుగా అడుగుతూ వచ్చారని మీరా మిథున్‌ పేర్కొన్నారు. తన తల్లికి విశాల్‌ అంటే చాలా ఇష్టమని, అయితే  తనకు ధనవంతుడైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అందుకే విశాల్‌ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినట్టు తెలిపారు. మరి దీనికి విశాల్‌ ఎలా స్పందిస్తారో చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement