అప్పుడు క్లాసిక్స్‌కు రంగులద్దాడు.. ఇప్పుడు మెగాఫోన్‌ పట్టాడు!

Maya bazar Colorized Creative Director Jagan Mohan Turns As A Director - Sakshi

తెలుగు సినీ చరిత్రలో అద్భుత కళాఖండంగా నిలిచిన చిత్రం ‘మాయాబజార్‌’. కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో(1957) బ్లాక్‌ అండ్‌ వైట్‌లో విడుదలై సంచలనం సృష్టించింది. 2010లో ఈ చిత్రానికి రంగులద్ది కలర్‌లో రీరిలీజ్‌ చేస్తే భారీ స్పందన లభించింది. అయితే ఈ అద్భుత కళాఖండాన్ని  కలర్ లోకి మార్చడానికి ఓ ప్రముఖ వ్యక్తి చాలా కష్టపడ్డాడు. అతనే జగన్‌మోహన్‌.

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వందల నలుపు తెలుపు సినిమాలని రంగుల సినిమాలుగా మార్చిన జగన్‌మోహన్‌.. ఇప్పుడు మెగా ఫోన్‌ పట్టనున్నాడు. టెంపుల్ మీడియా సంస్థ ద్వారా చిత్ర రచయితా, దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు. డిసెంబర్ 29న వీరి దర్శకత్వంలో నిర్మించబడుతున్న చిత్రం ముహూర్తం పూజా కార్యక్రమంతో ఆరంభమయింది. శ్రీ యతీష్, నందిని నిర్మించే ఈ చిత్రం షెడ్యూల్, మిగిలిన విషయాలు   త్వరలో తెలియజేయ నున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top