
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మారాఠి నటుడు ప్రదీప్ పట్వర్ధన్ హఠాన్మరణం చెందారు. మంగళవారం ముంబైలోని తన నివాసంలో గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యలు తెలిపారు. ప్రదీప్ ఆకస్మిక మరణంతో మరాఠి చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. నటుడి మృతికి మహరాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే నివాళులు అర్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ ‘తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ప్రదీప్ పట్వార్థన్ హఠాన్మరణం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది. మరాఠి సినీ పరిశ్రమ ఓ లెజెండరి నటుడిని కొల్పోయింది’ అంటూ రాసుకొచ్చారు.
చదవండి: ‘మా అమ్మ ఉండుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేదాన్ని’
అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ సంతాపం ప్రకటించారు. అలాగే మరాఠి ఇండస్ట్రీకి చెందిన సినీ, టీవీ నటీనటులు సైతం ప్రదీప్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రదీప్ పట్వర్థన్ తనదైన నటనతో లెజెండరి యాక్టర్‌గా పేరు సంపాదించుకున్నారు. ‘ఎక్ ఫుల్ ఛార్ హాఫ్’, ‘డాన్స్ పార్టీ’, ‘మే శివాజీరాజీ భోంస్లే బోల్తె’ వంటి మరాఠి సినిమాలతో మంచి గుర్తింపు పొందారు. ఇటీవల ఆయన అనురాగ్ కశ్యప్ ‘బాంబే వెల్వెట్’ క్రైం థ్రిల్లర్ చిత్రంలో నటించారు. వీటితో పాటు ఆయన మరాఠి టీవీ సీరియల్స్‌లో సైతం నటించారు.
मराठी रंगभूमीवरील मोरूची मावशी, बायको असून शेजारी, लग्नाची बेडी तसेच मराठी चित्रपटसृष्टीत आपल्या सहजसुंदर अभिनयाने रसिक प्रेक्षकांच्या हृदयावर अधिराज्य गाजवणारे सदाबहार अभिनेते प्रदीप पटवर्धन यांचे दुःखद निधन झाले. त्यांच्या जाण्याने मराठी कलासृष्टीने उमद्या कलावंताला गमावले आहे. pic.twitter.com/CVjESFYCkf
— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) August 9, 2022