ఆసక్తి రేపుతున్న 'ది మాన్షన్ హౌస్' కాన్సెప్ట్ పోస్టర్ | The Manseon House Concept Poster Released | Sakshi
Sakshi News home page

ఆసక్తి రేపుతున్న 'ది మాన్షన్ హౌస్' కాన్సెప్ట్ పోస్టర్

Mar 1 2022 4:57 PM | Updated on Mar 1 2022 4:57 PM

The Manseon House Concept Poster Released - Sakshi

టాలీవుడ్‌లో హారర్‌ థ్రిల్లర్‌ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. అందుకే నేటితరం దర్శకులు ఎక్కువగా హారర్‌ థ్రిల్లర్‌ కథలను ఎంచుకుటున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంచుకొని.. ఆడియెన్స్‌ని థ్రిల్‌ చేస్తున్నారు. అలా ఓ వైవిధ్యభరితమైన కథలో తాజాగా తెరకెక్కుతున్న హారర్‌ మూవీ 'ది మాన్షన్ హౌస్'. . అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్‌. మహా శివరాత్రి కానుకగా మంగళవారం ‘ది మాన్షన్ హౌస్' కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. కేవలం బ్లాక్ అండ్ వైట్ కలర్స్‌తో డిజైన్ చేసిన ఈ పోస్టర్ సినిమాలో ఏదో కొత్త పాయింట్ చూపించబోతున్నట్లు స్పష్టం చేస్తోంది. పెద్ద బంగ్లా, ఆ బంగ్లా మీద ఒక లేడీ, ఆకాశంలో ఎగురుతున్నట్లుగా మనుషుల రూపాలు సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. 

తలారి వీరాంజనేయ సమర్పణలో శ్రీ హనుమాన్ ఆర్ట్స్ బ్యానర్‌పై హేమంత్ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ది మాన్షన్ హౌస్' సినిమాకు బీసీవీ సత్య రాఘవేంద్ర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో సుశీల్ మెహర్, యష్ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా..వృందా కృష్ణ ఫీమేల్ లీడ్‌లో కనిపించనున్నారు. కమల్ తేజ నార్ల, షారుఖ్, రాజీవ్ సిద్దార్థ్, రాజ్ రాయల్, శ్రవణ్ భరత్, శామీర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement