నిలవాలి కలకాలమే... | Abhinaya Krishna release friendship melody Sakhi song from Kamakhya | Sakshi
Sakshi News home page

నిలవాలి కలకాలమే...

Apr 5 2026 12:45 AM | Updated on Apr 5 2026 12:45 AM

Abhinaya Krishna release friendship melody Sakhi song from Kamakhya

‘‘రా నాతో... ఆ ఆకాశంలో మేఘాలవుదాం... ఓ వర్షం కురిపించేద్దామ్‌..’ అంటూ మొదలవుతుంది ‘కామాఖ్య’ సినిమాలోని ‘సఖీ’పాట. సమైరా, సముద్ర ఖని, అభిరామి ప్రధానపాత్రధారులుగా, అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన థ్రిల్లర్‌ సినిమా ‘కామాఖ్య’. వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్‌ రాజ్‌ ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి స్నేహం నేపథ్యంలో సాగే మెలోడీ సాంగ్‌  ‘సఖీ’ లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

‘‘సఖీ... గులాబీ మన స్నేహమే... సరదాల దీవి మన స్నేహమే... సఖీ’, ఇలాంటి మన స్నేహమే... నిలవాలి ఇంక కలకాలమే..’ అంటూ ఈపాట సాగుతుంది. సంగీత దర్శకుడు గ్యాని స్వర కల్పనలో అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించిన ఈపాటను లక్ష్మీ మేఘన ఆలపించారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement