మంగళవారం మూవీ.. ఆ టాలీవుడ్‌ హీరోను దించేశారుగా! | Mangalavaram Movie Team Do Not Reveal Tollywood Hero Name | Sakshi
Sakshi News home page

Mangalavaram Movie: పాయల్ రాజ్‌పుత్‌ మూవీ..ఆ హీరోను ఎవరు ఉహించి ఉండరు!

Published Fri, Nov 17 2023 5:57 PM | Last Updated on Fri, Nov 17 2023 8:38 PM

Mangalavaram Movie Team Do Not Reveal Tollywood Hero Name - Sakshi

'ఆర్ఎక్స్ 100' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఆ తర్వాత ఒక్క సరైనా హిట్ పడలేదు. తాజాగా  బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతితోనే మళ్లీ జతకట్టింది. పాయల్ ప్రధాన రోల్‌లో తెరకెక్కించిన మంగళవారం మూవీ నవంబరు 17న సినిమా థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే ఆడియన్స్ నుంచి పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.  ఆర్‌ఎక్స్‌100 మూవీతో తొలి ప్ర‌య‌త్నంలోనే ప్రేక్షకులను మెప్పించారు అజ‌య్ భూప‌తి. అయితే ఆ తర్వాత అజ‌య్ మ‌హాస‌ముద్రం మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాల‌న్న ల‌క్ష్యంతో పాయ‌ల్‌తో క‌లిసి ‘మంగ‌ళ‌వారంతో దూసుకొచ్చారు. 

(ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?)

అయితే ఈ చిత్రం గురించి పాత్రలపై ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే వచ్చారు. కానీ ఈ సినిమాలోని ఓ లీడ్ క్యారెక్టర్‌ పేరును మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు. ఇంతలా సోషల్ మీడియా ఉన్న ఈ రోజుల్లో ఓ మెయిన్ రోల్ చేసిన హీరో పేరును బయటకు రాకుండా చేయడమంటే మామూలు విషయం కాదు. కానీ అజయ్ భూపతి చేసి చూపించారు. ఆ పాత్రలో నటించింది మన టాలీవుడ్‌ హీరోనే కావడం మరో విశేషం. ఇంతకీ అతనెవరో మీకు తెలుసుకోవాలనుందా? అయితే ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. 

మొత్తానికి ఈ చిత్రంలో లీడ్‌ రోల్ పోషించింది పాయల్ రాజ్‌పుత్‌. కానీ మన తెలుగు హీరో పేరును దాచి ఆడియన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు అజయ్. ఆ హీరో మరెవరో కాదు.. బలగం ఫేమ్ ప్రియదర్శి పులికొండ. వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కించిన బలగం సినిమాలో నటించారు. ఈ విషయాన్ని ఎక్కడా రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. ఈ రోజుల్లో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ లీక్ అవుతున్నాయి. అలాంటిది ప్రియదర్శి నటించాడనే విషయాన్ని మాత్రం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారంటే మంగళవారం చిత్రబృందాన్ని మెచ్చుకోవాల్సిందే.

(ఇదీ చదవండి: Mangalavaaram Review: ‘మంగళవారం’ మూవీ రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement