సినిమానే నా ఊపిరి | Sakshi
Sakshi News home page

సినిమానే నా ఊపిరి

Published Mon, Oct 17 2022 4:55 AM

Manchu Mohan Babu Speech At Ginna Movie Pre Release Event - Sakshi

‘‘సినిమానే మన ఊపిరి అని మా గురువు దాసరి నారాయణరావుగారు అనేవారు.. అలా సినిమానే మా ఊపిరి.. నా ఊపిరి. కళామతళ్లి మాకు భోజనం పెట్టింది. ‘జిన్నా’ సినిమా గొప్ప  హిట్‌ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని నటుడు, నిర్మాత మంచు మోహన్‌ బాబు అన్నారు. విష్ణు మంచు హీరోగా, పాయల్‌ రాజ్‌పుత్, సన్నీలియోన్‌ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘జిన్నా’. ఈశాన్‌ సూర్య దర్శకత్వం వహించారు. అవ్రామ్‌ భక్త మంచు సమర్పణలో అవా ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మంచు మోహన్‌బాబు నిర్మించిన ఈ మూవీ ఈ నెల 21న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా ‘జిన్నా జాతర’ పేరుతో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో మంచు మోహన్‌ బాబు మాట్లాడుతూ–‘‘జిన్నా’లో విష్ణు ఎంతో రిస్కీ షాట్స్‌ చేశాడు.. జీవితంలో అలాంటి సన్నివేశాలు చేయడం మంచిది కాదని చెప్పాను. ‘ఢీ’ కంటే పది రెట్ల హిట్‌ని ‘జిన్నా’ అందుకోవాలి. విష్ణుని ఛోటా కె.నాయుడు అద్భుతంగా చూపించాడు. మంచి మ్యూజిక్‌ ఇచ్చిన అనూప్‌కి థ్యాంక్స్‌. అరియానా– వీవీయానా ఇంత అద్భుతంగా పాడతారని కలలో కూడా ఊహించలేదు. ఈ సినిమా ద్వారా సూర్య గొప్ప డైరెక్టర్‌ కావాలని కోరుకుంటున్నా. నాకు ఎన్నో హిట్‌ పాటలకు డ్యాన్స్‌లు సమకూర్చిన ప్రభుదేవా ‘జిన్నా’ లో విష్ణుకి నృత్యరీతులు సమకూర్చారు.. మా ఫ్యామిలీలో ఒకడిగా, మాపై ఉన్న గౌరవంతో తను డబ్బు తీసుకోకుండా చేసినందుకు థ్యాంక్స్‌’’ అన్నారు.

విష్ణు మంచు మాట్లాడుతూ–‘‘జిన్నా’ సినిమాకి ముందుగా కోన వెంకట్‌గారికి థ్యాంక్స్‌. ఛోటాగారితో ఎప్పటి నుంచో పనిచేయాలని అనుకుంటున్నాను.. ఇప్పుడు కుదిరింది. ‘జిన్నా’ నా మనసుకి బాగా దగ్గరైన సినిమా. నా కెరీర్‌లో బెస్ట్‌ మ్యూజిక్‌ ఇచ్చిన అనూప్‌ రూబెన్స్‌కి థ్యాంక్స్‌. అరియానా–వీవీయానా తొలిసారి అయినా అద్భుతంగా పాడారు. ఇంత మంచి సినిమా ఇచ్చిన సూర్యకి థ్యాంక్స్‌. అందరూ మా సినిమాని చూసి, మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు.
 
‘జిన్నా’ కథా రచయిత జి.నాగేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ–‘‘జిన్నా’ రషెస్‌ చూసినప్పుటి నుంచి ఒక బ్లాక్‌బస్టర్‌ వైఫై నా చుట్టూ తిరుగుతోంది.. ఇది వందశాతం నిజం. సినిమా బ్లాక్‌ బస్టర్‌. ఇండస్ట్రీలో హిట్‌ చూసిన ఎవరైనా సరే.. అమితాబ్‌ బచ్చన్, రజనీకాంత్, మోహన్‌ బాబు, చిరంజీవిగార్లు.. ఎవరైనా ఫ్లాప్‌ చూస్తారు.. కానీ, ఫ్లాప్‌ని ఎదుర్కొనే దమ్ము ఉండాలి. ఆ దమ్ము మోహన్‌బాబుగారి ద్వారా విష్ణుకి వచ్చింది.. తను ఎదుర్కొన్నాడు.. ‘జిన్నా’ తో బ్లాక్‌ బస్టర్‌ కొడతాడు’’ అన్నారు.‘‘జిన్నా’ సినిమా కాదు.. మా అన్నయ్య(మోహన్‌బాబు)గారు నాపై పెట్టిన బాధ్యత. ఈ చిత్రం వందశాతం ప్రేక్షకుల్ని సంతృప్తి పరుస్తుంది’’ అన్నారు చిత్ర క్రియేటివ్‌ ప్రొడ్యూసర్, స్క్రిప్ట్‌ రైటర్‌ కోన వెంకట్‌.
ఈ సమావేశంలో సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌, నటులు అలీ, చమ్మక్‌ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement