పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన మోహన్‌బాబు

రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ వేడుక సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల సినియర్ హీరో మంచు మోహన్‌బాబు స్పందించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)ఎన్నికలు పూర్తయిన తర్వాత పవన్ కల్యాణ్ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతానని మోహబాబు అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు.
(చదవండి: పవన్‌కు ఎందుకంత భయం: మంత్రి అనిల్)
‘నా చిరకాల మిత్రుని సోదరుడైన పవన్ కల్యాణ్ నువ్వు నాకంటే చిన్నవాడివి అందుకని ఏకవచనంతో సంభోదించాను. పవన్ కల్యాణ్‌గారు అనడంతో కూడా తప్పేమీలేదు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్. సంతోషమే. ఇప్పుడు ‘మా’ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా నిలబడ్డాడు అన్న సంగతి నీకు తెలిసిందే. అక్టోబర్ 10వ తేదిన ఎలక్షన్స్ అయిపోతాయి. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతి మాటకు నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను. ఈలోగా నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని.. నీ అమూల్యమైన ఓటుని నీ సోదర సమానుడైన విష్ణుబాబుకి, అతని ప్యానల్‌కి వేసి వాళ్లని గెలిపించాలని కోరుకుంటున్నాను’అని మోహన్ బాబు ట్వీట్ చేశారు.
To My Dear @PawanKalyan pic.twitter.com/xj1azU3v8B
— Mohan Babu M (@themohanbabu) September 26, 2021