చిరంజీవికి అవార్డు.. మంచు మోహన్‌ బాబు ఏం అన్నారంటే | Manchu Mohan Babu Comments On Megastar Chiranjeevi | Sakshi
Sakshi News home page

చిరంజీవికి అవార్డు.. మంచు మోహన్‌ బాబు ఏం అన్నారంటే

Jan 27 2024 9:11 AM | Updated on Jan 27 2024 9:36 AM

Manchu Mohan Babu Comments On Megastar Chiranjeevi - Sakshi

టాలీవుడ్ మెగాస్టార్‌కు  అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ వరించిన విషయం తెలిసిందే. దేశంలోనే రెండో అత్యున్నతమైన అవార్డు ఆయనకు దక్కడంతో పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నటుడిగా 1978లో కెరీర్ ప్రారంభించిన ఆయన అలుపెరగకుండా సినిమాలు చేస్తూనే ఎందరికో దిక్సూచిగా నిలిచారు. మెగాస్టార్‌కు అవార్డు ప్రకటన రాగానే  దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌​, ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్‌ కూడా ఆనందం వ్యక్తం చేశారు.

తాజాగా మంచు ఫ్యామిలీ నుంచి మోహన్‌ బాబు, విష్ణు రియాక్ట్‌ అయ్యారు. నా ప్రియమైన స్నేహితుడికి శుభాకాంక్షలు. ఈ గౌరవానికి నువ్వు అర్హుడివి.. అవార్డు పొందిన నిన్ను చూసి ఎంతో గర్వ పడుతున్నానని మోహన్ బాబు తన ఎక్స్‌ పేజీలో ట్వీట్ చేశారు. నిద్ర లేవగానే ఇంత మంచి వార్త విన్నాను.. చాలా సంతోషం అనిపించింది. చిరంజీవి గారికి ఎంతో విలువైన పద్మ విభూషణ్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. మన తెలుగు చిత్ర సీమకు ఈ అవార్డు గర్వ కారణం అంటూ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు.

భారీ వేడుకకు ప్లాన్‌
చిరంజీవికి అరుదైన గౌరవం దక్కడంతో  టాలీవుడ్ ప్రముఖులంతా కూడా చిరంజీవి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో  మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు కూడా చిరు ఇంటికి వెళ్లి కలిశారు. అనంతరం దిల్‌ రాజు మాట్లాడుతూ.. ఇంతటి శుభ సందర్భంగా మెగాస్టార్‌ కోసం చిత్ర పరిశ్రమ నుంచి ఒక వేడుకను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆ వివరాలు త్వరలో చెబుతామని దిల్‌ రాజు చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement