డబుల్‌ ధమాకా | Manchu Manoj What The Fish Movie First Look Motion Release | Sakshi
Sakshi News home page

డబుల్‌ ధమాకా

Published Sun, May 21 2023 4:04 AM | Last Updated on Sun, May 21 2023 4:04 AM

Manchu Manoj What The Fish Movie First Look Motion Release - Sakshi

మంచు మనోజ్‌ తన పుట్టినరోజుని (మే 20) పురస్కరించు కుని రెండు సినిమాల అప్‌డేట్‌తో డబుల్‌ ధమాకా ఇచ్చారు. వరుణ్‌ కోరుకొండ దర్శకత్వంతో మనోజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వాట్‌ ది ఫిష్‌’. మనం మనం బరంపురం అనేది ట్యాగ్‌ లైన్‌. 6ఐఎక్స్‌ సినిమాస్‌పై విశాల్‌ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్నారు.

మనోజ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఫస్ట్‌ లుక్‌ గ్లింప్స్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్‌. ఇందులో మనోజ్‌ విభిన్నమైన గెటప్‌లలో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శక్తికాంత్‌ కార్తీక్, సహనిర్మాత: వరుణ్‌ కోరుకొండ.   ఎల్‌ఎస్‌ ప్రొడక్షన్స్‌లో...  మనోజ్‌ హీరోగా మరో కొత్త మూవీ ప్రకటన శనివారం వచ్చింది. భాస్కర్‌ బంటుపల్లి డైరెక్షన్‌లో  మమత సమర్పణలో ఎల్‌ఎస్‌ ప్రొడక్షన్స్‌పై ఎం. శ్రీనివాసులు, డి. వేణుగోపాల్, ఎం. మమత, ముల్లపూడి రాజేశ్వరి ఈ సినిమాను నిర్మించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement