మహేశ్ బాబు- ఎస్ఎస్ రాజమౌళి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. నవంబర్లో #SSMB29 అప్‌డేట్ ఇస్తామని గతంలోనే జక్కన్న ఒక పోస్ట్ చేశారు. సినిమా టైటిల్తో పాటు మహేశ్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని చెప్పడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, నవంబర్ మొదలు కావడంతో సోషల్ మీడియాలో #noveMBerwillbehiSStoRic, #noveMBer వంటి హ్యాష్‌ట్యాగ్స్ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే మొదట మహేశ్ ఒక ట్వీట్ వేశారు. ఆ తర్వాత రాజమౌళి నుంచి రిప్లై వచ్చింది. అలా ఇద్దరి మధ్య ట్వీట్ వార్ మొదలైంది.
#SSMB29 అప్‌డేట్ కోసం 'ఆల్రెడీ నవంబర్ వచ్చేసింది' అని మహేశ్బాబు ట్వీట్ వేశారు.. తాను కూడా ఎదురుచూస్తున్నట్లు కళ్ల ఎమోజీ పెట్టారు. దానికి రాజమౌళి కూడా ఫన్నీగా 'అవును, నవంబర్ వచ్చేసింది. ఈ నెలలో ఏ సినిమాకి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నావ్' అంటూ పంచ్ వేశారు. దీంతో మహేశ్ కూడా 'మీరు ఎప్పటి నుంచో తెరకెక్కిస్తున్న మహాభారతం సినిమాకు ఇద్దాం అనుకుంటున్నాను' అంటూ రిటర్న్ పంచ్ ఇచ్చారు.
అయితే, మహేశ్ అసలు విషయానికి వద్దాం అంటూ.. 'ముందుగా నవంబర్‌లో మీరు మాకు ఒక హామీ ఇచ్చారు. దయచేసి ఆ మాట నిలబెట్టుకోండి' అని కోరారు. దీంతో జక్కన్న కూడా 'సరే మహేశ్.. నవంబర్ మొదలైంది ఇప్పుడే కదా.. మేము తప్పకుండా ఒక్కొక్కటిగా వెల్లడిస్తాం' అని సమాధానం ఇచ్చారు.
ఇంకా ఎంత సమయం కావాలి సార్ అంటూ జక్కన్నకు మరో ట్వీట్ వేశారు మహేశ్.. '2030లో స్టార్ట్ చేద్దామా..? మన దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా జనవరి నుంచే హైదరాబాద్‌లోని ప్రతి స్ట్రీట్లో తనకు నచ్చిన స్టోరీలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తోంది' అంటూ ప్రియాంక చోప్రాను ట్యాగ్ చేసి మహేశ్ బాబు సెటైర్లు వేశారు.

బ్లైండ్‌గా ఏసేస్తా అంటూ ప్రియాంక ఎంట్రీ
'హలో హీరో.. సెట్‌లో నువ్వు నాతో చెప్పిన కథలన్నీ లీక్ చేయాలనుకుంటున్నావా ఏంటి.. నేను ఒక్కసారి మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా ఏసేస్తా..' అంటూ మహేశ్ బాబుకు అతని స్టైల్లోనే ప్రియాంక చోప్రా రిప్లై ఇచ్చింది. ఇంతలో జక్కన్న ఎంట్రీ ఇచ్చేసి 'ప్రియాంక చోప్రా ఇందులో నటిస్తుందనే విషయాన్ని ఎందుకు బయటపెట్టేశావ్ మహేశ్.. మంచి సర్‌ప్రైజ్‌ని ఇద్దాం అనుకుంటే నువ్వు నాశనం చేశావ్' అంటూ పంచ్ వేశారు. ఇంతలో మహేశ్ కూడా మరో పంచ్తో తెరపైకి వచ్చారు. 'మీ ఉద్దేశంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక సర్‌ప్రైజ్ అని చెప్పాలనుకుంటున్నావా..' అని మరో లీక్ ఇచ్చేశారు. అప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక పోస్ట్ ఇలా చేశారు. 'రాజమౌళి సార్.. నేను ఇలాగే తరుచుగా వెకేషన్ కోసం హైదరాబాద్‌కు వస్తూ ఉంటే.. నా కుటుంబం నన్ను అనుమానించడం స్టార్ట్ చేస్తారు' అని ముగిస్తారు. ఇలా సరదాగా ట్వీట్లతోనే ఈ సినిమాలో నటిస్తున్న వారిని తొలిసారి పరిచయం చేశారు.
It’s November already @ssrajamouli 👀
— Mahesh Babu (@urstrulyMahesh) November 1, 2025


