త్వరలో సుమంత్‌ ‘మహేంద్రగిరి వారాహి’ టీజర్ | Mahendragiri Varahi Movie Latest Update | Sakshi
Sakshi News home page

త్వరలో సుమంత్‌ ‘మహేంద్రగిరి వారాహి’ టీజర్

May 26 2026 9:48 PM | Updated on May 26 2026 9:49 PM

Mahendragiri Varahi Movie Latest Update

సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న చిత్రం మహేంద్రగిరి వారాహి. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కధాంశాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సుమంత్ , మీనాక్షి గోసామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, కమల్ కామరాజు, సత్యసాయి శ్రీనివాస్, వంశీ చాగంటి, మంజు భార్గవి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. 

ఈ సినిమాకు కథ మురళి. త్వరలో విడుదల కాబోతున్న ఈ టీజర్ పై సోషల్ మీడియాలో ఆసక్తి నెలకొంది, మహేంద్రగిరి వారాహి టీజర్ విజువల్ గా ఆకట్టుకుంటుంది, రిచ్ విజువల్స్ మరియు ప్రామిసింగ్ సీజి వర్క్ తో గ్రాండ్ గా ఈ టీజర్ ఉండబోతోందని, త్వరలో ప్రేక్షకులు మహేంద్రగిరి వారహి టీజర్ తో సరికొత్త అనుభూతిని పొందుతారని చెబుతున్నారు.సుమంత్ కు తన కెరీర్ లో మహేంద్రగిరి వారాహి సినిమా ఒక మైలు రాయిగా నిలిచిపోయే సినిమాగా నిర్మాత కాలిపు మధు ఈ సినిమాను రూపొందించారు, దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement