
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న 'మదరాసి'(Madharaasi ) సెన్సార్ పూర్తి చేసుకుంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచేశాయి. దీంతో సెప్టెంబర్ 5న విడుదల కానున్న మదరాసి కోసం ప్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్‌తో పాటు విద్యుత్ జమాల్, బిజు మీనన్, షబ్బీర్, విక్రాంత్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
'మదరాసి' చిత్రానికి U/A సర్టిఫికెట్‌ను సెన్సార్ బోర్డ్ జారీ చేసింది. సుమారు 1:30 నిమిషాల సీన్స్‌కు అభ్యంతరాలు చెబుతూ నాలుగు చోట్ల కట్స్ సూచించింది. సినిమా రన్‌టైమ్ 2గంటల 47 నిమిషాలు ఉంది. హై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం సరికొత్త ఎగ్జయిటింగ్ యాక్షన్ ప్యాక్డ్ కథను చూపించబోతున్నట్లు తెలుస్తోంది.