గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 'మేడ్ ఇన్ ఇండియా' సింగర్‌! | Made In India Hitmaker Alisha Chinai Latest Pic Goes Viral | Sakshi
Sakshi News home page

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 'మేడ్ ఇన్ ఇండియా' సింగర్‌!

Oct 29 2025 12:01 PM | Updated on Oct 29 2025 12:09 PM

Made In India Hitmaker Alisha Chinai Latest Pic Goes Viral

అలీషా చినాయ్.. ఇప్పటి జనరేషన్కి పేరు పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. నైంటీస్బ్యాచ్కి మాత్రం పేరు చెప్పగానేమేడ్ఇన్ఇండియాపాటను ఆలపిస్తారు. 1990ల్లో 'మేడ్ ఇన్ ఇండియా', 'లవర్ గర్ల్', 'సెక్సీ సెక్సీ ముఝే లోగ్ బోలే' వంటి హిట్ పాటలతో ఇండిపాప్ రాణిగా రాణించిన పాప్ సింగర్ అలీషా చినాయ్(Alisha Chinai)‌. గతకొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సింగర్‌.. సోషల్మీడియా ద్వారా మాత్రం తన అభిమానులతో టచ్లోనే ఉంటుంది

తాజాగా అలీషా తన ఇన్స్టా ఖాతాలో షేర్చేసిన ఫోటో అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 60 ఏళ్ల వయసు ఉన్న ఆమెమేడ్ ఇన్ ఇండియా' నాటి గెటప్లో ఉన్న ఫోటోని షేర్చేసింది. జనరేషన్వాళ్లు ఫోటోని చూస్తే..అస్సలు గుర్తుపట్టలేరు

ఆమె లుక్ ఇప్పుడు మరింత మెచ్యూర్‌గా మారింది. కానీ వయసు ప్రభాసం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఫోటో సోషల్మీడియాలో వైరల్అవుతోంది. ‘షాకింగ్‌.. అలీషా ఇలా మారిపోయిందేంటి? ఏమైంది? ’, ఆమె పాప్‌ సింగర్‌ అలీషానేనా?.. ఆమె వాయిస్‌ అంటే నాకు చాలా ఇష్టం’ అంటూ నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. 

అలీషా చినాయ్ 1965 మార్చి 18న అహ్మదాబాద్‌లో గుజరాతీ కుటుంబంలో జన్మించింది. 1985లో 'జాదూ' ఆల్బంతో తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె, బప్పీ లహిరీతో కలిసి 'అడ్వెంచర్స్ ఆఫ్ టార్జన్', 'డాన్స్ డాన్స్' వంటి సినిమాల్లో డిస్కో హిట్లు ఇచ్చింది. 1995లో విడుదలైన 'మేడ్ ఇన్ ఇండియా' ఆల్బం భారీ విజయం సాధించి, ఆమెను 'క్వీన్ ఆఫ్ ఇండిపాప్'గా మార్చింది.

బాలీవుడ్‌లో కూడా ఆమె మార్క్‌గా ఉంది. 'కజ్రా రే' (బంటీ ఆర్ బాబ్లీ, 2005) పాటకు ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డు అందుకుంది. 'రుక్ రుక్ రుక్', 'ప్యార్ ఆయా', 'టచ్ మీ', 'తింకా తింకా' వంటి హిట్లు ఆమె స్వరానికి గుర్తింపు తెచ్చాయి. అయితే, 1996లో అను మలిక్‌పై సెక్సువల్ హారస్‌మెంట్ ఆరోపణలు చేసి వివాదాల్లో చిక్కుకుంది. తర్వాత 2018 మీటూ క్యాంపెయిన్‌లో ఆమె మాటలు మరోసారి గుర్తుకు వచ్చాయి.

వ్యక్తిగత జీవితంలో కూడా ఆమెకు కష్టాలు ఎదురయ్యాయి. మేనేజర్ రాజేష్ ఝవేరీతో 1986లో పెళ్లి చేసుకుని 1994లో విడాకులు తీసుకుంది. తండ్రి క్యాన్సర్‌తో బాధపడటంతో కెరీర్‌పై దృష్టి తగ్గింది. 2020 నుంచి తజకిస్తాన్‌కు చెందిన ఫుర్కత్ అజమోవ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement