breaking news
Bollywood Singer
-
ఇండస్ట్రీలో మా పరిస్థితి చాలా దారుణం: ప్రముఖ సింగర్ ఆవేదన
సినిమా ఇండస్ట్రీలో స్టార్డమ్ తర్వాత ఎక్కువగా వినిపించే మాట రెమ్యునరేషన్. హీరోకు ఎన్ని కోట్లు, హీరోయిన్‌కు ఎంత అనే చర్చ మొదలవుతుంది. ఆ తర్వాత ఒక్క సినిమాకు డైరెక్టర్ ఎంత తీసుకుంటున్నారు. ఇప్పుడున్న మార్కెట్లో స్టార్ హీరోలైతే కోట్ల రూపాయల్లో పారితోషికం అందుకుంటున్నారు. కొందరు డైరెక్టర్స్ సైతం హీరో రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకునేవాళ్లు కూడా ఉన్నారు. కానీ ఇంత భారీ మొత్తంలో కోట్ల రూపాయలు తీసుకుంటున్న సినీ ఇండస్ట్రీలో సింగర్స్ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని చెబుతోంది ప్రముఖ గాయని కనికా కపూర్. ఇండియాలో కొంతమంది సింగర్స్‌కు కనీస పారితోషికం కూడా దక్కడం లేదని అన్నారు.బేబీ డాల్, చిట్టియాన్ కలైయాన్ లాంటి హిట్ సాంగ్స్‌తో ఫేమ్ తెచ్చుకున్న ప్రముఖ సింగర్ కనికా కపూర్. ఇండియాలో సింగర్స్ రెమ్యునరేషన్‌పై ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్న ఆమె బాలీవుడ్లో సింగర్స్ ఎందుర్కొంటున్న ఆర్థిక సమస్యల గురించి మాట్లాడింది. తనకు సరైన పారితోషికం లభించడం లేదని తెలిపింది. నాతో పాటు స్టార్ హోదా గాయకుల పరిస్థితి కూడా ఇదేనన్నారు. సింగర్స్ లైవ్ కన్సర్ట్ ద్వారా మాత్రమే డబ్బులు సంపాదించే అవకాశముందని వెల్లడించారు.కనికా కపూర్ మాట్లాడుతూ.. " బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సింగర్స్‌కు తగిన పారితోషికం లభించదు. నాకు ఓ కాంట్రాక్ట్‌లో కేవలం రూ. 101 చెల్లించారు. అది కూడా ఈ డబ్బులతో మీకు సాయం చేస్తున్నామని నాతో గొప్పగా చెప్పారు. కేవలం నాకే కాదు.. స్టార్ హోదా ఉన్నవారి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. భారతదేశంలో పెద్ద సింగర్ తన ఐకానిక్ పాటలకు చాలా వరకు డబ్బు పొందుతాడని నేను అనుకోవడం లేదు. సింగర్స్‌కు లైవ్ కన్సర్ట్స్ మాత్రమే డబ్బు సంపాదించే ఏకైక మార్గం. మీరు ప్రదర్శన ఇవ్వగలిగినంత వరకు సంపాదిస్తూనే ఉంటారు. అలాగే మాకు ఏదైనా జరిగితే పెన్షన్ పథకం కూడా లేదు" అని ఆవేదన వ్యక్తం చేసింది.కాగా.. కనికా కపూర్ 'రాగిణి ఎంఎంఎస్- 2'లోని 'బేబీ డాల్'పాటతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సాంగ్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. ఆ తర్వాత లవ్లీ 'హ్యాపీ న్యూ ఇయర్', దేశీ లుక్ 'ఏక్ పహేలి లీలా', బీట్ పె బూటీ 'ఎ ఫ్లయింగ్ జాట్' వంటి వరుస హిట్ సాంగ్స్‌తో బాలీవుడ్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇటీవల బాలీవుడ్లో 'మేరే హస్బెండ్ కి బివి' చిత్రంలోని 'గోరీ హై కలైయాన్' పాటను పాడారు. -
43 ఏళ్ల వయసు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి.. ఈ స్టార్ సింగర్ గుర్తుందా?
చిత్ర పరిశ్రమలో పెళ్లిళ్లు ఎంత త్వరగా జరుగుతాయో...విడాకులు అంతే త్వరగా తీసుకుంటున్నారు. కొందరు మాత్రం ఏళ్లుగా కలిసి ఉంటే..మరికొంత మంది ఇలా పెళ్లి చేసుకొని అలా విడాకులు తీసుకుంటున్నారు. ఇంకొంత మంది మాత్రం ఏళ్లుగా కలిసి ఉండి పిల్లలు పెద్దవాళ్లు అయిన తర్వాత విడిపోతున్నారు. అలా విడాకులు తీసుకొని రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్ గురించి ఆసక్తికర విషయాలు..18 ఏళ్లకే పెళ్లిపెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన మలుపు. వివాహ బంధం బలంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అలానే తన వివాహ బంధం కూడా గట్టిగానే ఉండాలని కోరుకుంది ప్రముఖ సింగర్ కనికా కపూర్(Kanika Kapoor ). బేబీ డాల్, చిట్టియక్కలాయాన్, టుకుర్ టుకుర్, జెండా ఫూల్ పాటలతో పాటు పుష్ప సినిమాలోని ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా సాంగ్‌తో జనాలను ఉర్రూతలూగించిన ఈ అందాల గాయని వైవివాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. 18 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకుంది. అనంతరం 43 ఏళ్ల వయసులో మరో పెళ్లి చేసుకుంది.జీవితాన్నే మార్చేసిన పెళ్లిలక్నోలోని ఖత్రీ కుటుంబంలో జన్మించిన కనికా.. 12 ఏళ్ల వయసులోనే సంగీతం వైపు మొగ్గు చూపింది. ప్రముఖ సంగీతకారుడు పండిట్ గణేష్ ప్రసాద్ మిశ్రా శిక్షణ పొంది.. 15 ఏళ్ల వయసులోనే భజన విద్వాంసుడు అనుప్ జలోటాతో కలిసి అతని ప్రదర్శనలకు వెళ్ళింది. అయితే ఆమెకు 18 ఏళ్ల వయసు రాగానే పెళ్లి చేశారు. 1988 రాజ్ చందోక్ అనే ఎన్నారైని పెళ్లి చేసుకొని లండన్ వెళ్లిపోయింది.వీరికి ముగ్గురు పిల్లలు అయానా, మారా, యువరాజ్ జన్మించారు. పెళ్లికి ముందే తాను పాటలు పాడుకుంటానని భర్తతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ అత్త మామలు మాత్రం పాటలు పాడొద్దని కండీషన్ పెట్టారట. దీంతో కనికా సంగీతానికి దూరమైంది. కొన్నాళ్లకు రాజ్‌తో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంది.ఒంటరిగా పదేళ్లు..అయిష్టంగానే పెళ్లి చేసుకున్నపటికీ..భర్త, పిల్లలే ప్రపంచంగా బ్రతికింది కనికా. కొన్నేళ్ల తర్వాత భర్తతో మనస్పర్థలు వచ్చాయి. కొన్ని విషయాల్లో అతను చేసిన మోసాలు కనిక దృష్టికి వచ్చాయి. అవి భరించడం కనిక వల్ల కాలేదు. దీంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుంది.‘మాది సాంప్రదాయ కుటుంబం. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. అయినా కూడా రాజ్‌తో కలిసి ఉండేందుకు నా మనసు ఒప్పుకోలేదు. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. కానీ నా పిల్లలు గుర్తొచ్చి అది విరమించుకున్నాను. ఏదేమైనా రాజ్‌తో కలిసి ఉండొద్దని భావించి విడాకులు తీసుకున్నాను’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 2012లో కనిక, రాజ్‌లు విడాకులు తీసుకున్నారు. దాదాపు పదేళ్లు ఒంటరిగా జీవితాన్ని గడిపి.. 2022లో రెండో పెళ్లి చేసుకుంది.43 ఏళ్ల వయసులో రెండో పెళ్లి..విడాకుల అనంతరం ముగ్గురు పిల్లలతో కలిసి ఒంటరిగానే గడిపింది కనిక కపూర్. 2022లో వ్యాపారవేత్త గౌతం హథీరమణిని వివాహం చేసుకుంది. అప్పుటికీ కనిక వయసు 43 ఏళ్లు. ‘పెళ్లి విషయం పిల్లలకు చెప్పగానే చాలా బాధపడ్డారు. కానీ పెళ్లికి కొన్ని రోజుల ముందు నా చిన్న కూతురు వచ్చి ‘గౌతంకి నిన్ను ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని చెప్పగానే నేను షాకయ్యాను. వెంటనే గౌతంతో పెళ్లి తర్వాత మనమందరం ఒకే కుటుంబం అవుతామని చెప్పాను. పెళ్లి మండపానికి నాతో పాటు నా కొడుకు రావడం, పేరాస్లో నా కూతర్లు ఇద్దరూ పాల్గొనడంతో ఎంతో ఎమోషనల్ అయ్యాను’ అని కనికా చెప్పింది. లండన్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో జరిగిన ఈ వివాహ వేడుకలో మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉసాసన కామినేనితో పాలు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. గౌతంతో 15 ఏళ్లుగా పరిచయం ఉందని.. 2020లో ప్రపోజ్ చేశాడని.. రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నామని ఓ ఇంటర్వ్యూలో కనిక చెప్పింది. View this post on Instagram A post shared by Kanika G Kapoor (@kanik4kapoor) -
హ్యాపీయెస్ట్ బర్త్‌డే మై బడ్డీ : గాయని బర్త్‌డే విషెస్ వైరల్ (ఫోటోలు)