Nithin-Krithi Shetty: డ్యాన్స్‌తో అదరగొట్టిన నితిన్‌, కృతీ శెట్టి..

Macherla Niyojakavargam: Adirindey Full Video Song Released - Sakshi

Macherla Niyojakavargam: హిట్లు ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్‌ హీరో నితిన్. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. బ్యూటీఫుల్‌ హీరోయిన్స్‌ కృతీ శెట్టి, కేథరిన్‌ థ్రేసా కథానాయికలుగా అలరించనున్న ఈ మూవీకి ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్‌ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ రెడ్డి, నికితారెడ్డి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ నుండే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచగా.. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌, పోస్టర్స్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక 'రారా రెడ్డి' అనే సాంగ్‌ అయితే అధిక వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఈ పాటలో వచ్చే 'రాను రాను అంటూనే చిన్నదో' అనే బీట్‌ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ మారింది. ఈ పాటతో టాలీవుడ్ స్టార్‌ హీరోల స్టెప్పులను సింక్‌ చేస్తూ అనేక వీడియోలను రిలీజ్‌ చేశారు. అవి కూడా నెటిజన్లను విపరీతంగా ఎంటర్‌టైన్‌ చేశాయి. 

తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్‌ విడుదలైంది. 'అదిరిందే పసిగుండే' అంటూ సాగే ఫుల్‌ వీడియో సాంగ్‌ను శనివారం (జులై 23) ఉదయం రిలీజ్‌ చేశారు. ఈ పాటలో నితిన్‌, కృతీశెట్టి తమ డ్యాన్స్‌తో అదరగొట్టారు. మహతి స్వర సాగర్‌ మ్యూజిక్‌ అందించగా పాటను సంజిత్‌ హెగ్డే ఆలపించారు. ఫ్యాక్షన్‌, పొలిటికల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top