MAA Elections 2021 : మసకబారుతున్న 'మా' ప్రతిష్ట..

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. రోజుకో ట్విస్ట్ బయటకు వస్తూ.. సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇన్నాళ్లు ప్రకాశ్ రాజ్‌కు మద్దతు ఇస్తూ.. ఆయన ప్యానల్‌లో సభ్యుడుగా ఉన్న బండ్ల గణేశ్ యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే.
ప్యానల్‌లోకి జీవితా రాజశేఖర్ ఎంట్రీ ఇవ్వడం తనకి నచ్చలేదని.. అందుకే ఆమెకు వ్యతిరేకంగా జనరల్ సెక్రటరీ పదవి కోసం పోటీలోకి దిగుతున్నానంటూ కామెంట్ చేయడం, ఆ వెంటనే జీవితా రాజశేఖర్ దీనికి కౌంటర్ బదులివ్వడం తెలిసిందే. మొదటి నుంచి మా ఎన్నికల విషయంలో సభ్యులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.
మేమంతా ఒకే ఫ్యామిలీ అంటూనే బహిరంగ విమర్శలకు దిగుతుండటం టాలీవుడ్‌ను ఇరుకున పడేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలతో ప్రతిష్ట మసకబారుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
చదవండి: MAA Elections 2021: ప్రకాష్‌రాజ్‌కు షాకిచ్చిన బండ్ల గణేష్
MAA Elections: ప్రకాశ్ రాజ్ ప్యానల్‌లో జీవితా రాజశేఖర్, హేమ