సూపర్ హిట్ చిత్రాలకు కేరాఫ్‌గా మారాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj). కార్తీతో ఖైదీ, విజయ్‌తో మాస్టర్, లియో, కమల్ హాసన్‌తో విక్రమ్, రజనీకాంత్‌తో కూలీ వంటి భారీ చిత్రాలను తెరకెక్కించారు. అయితే కూలీ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఈయన ట్రోలింగ్‌కు గురయ్యారు. ఇకపోతే కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి నటించనున్న చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదన్నది తాజా సమాచారం. ఇక కార్తీ హీరోగా తెరకెక్కనున్న ఖైదీ – 2 చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితి!
హీరోగా లోకేశ్
అదేవిధంగా హిందీలో అమీర్ ఖాన్ హీరోగా చిత్రం చేయబోతున్నట్లు జరిగిన ప్రచారానికి కూడా ఇప్పుడు ఫుల్ స్టాప్ పడింది. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు లోకేష్ కనకరాజ్ కథానాయకుడిగా అవతారమెత్తడం విశేషం. కెప్టెన్ మిల్లర్ చిత్రం ఫ్రేమ్ అరుణ్ మాదేశ్వరన్ (Arun Matheswaran) దర్శకత్వంలో హీరోగా నటించబోతున్నట్లు చాలా రోజులనుంచే ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ పూజా కార్యక్రమాలు గురువారం జరిగినట్లు తెలిసింది. ఈ సినిమా కోసం లోకేష్ కనకరాజ్ ఫైట్స్, ఆత్మ సంరక్షణ విద్యల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందారట! అలా ఈ చిత్రం కోసం ఆయన తన బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చుకున్నట్లు తెలుస్తోంది.


