పెళ్లైన వ్యక్తితో టాలీవుడ్‌ హీరోయిన్‌ పెళ్లి.. వేదిక ఫిక్స్! | Kriti Kharbanda And Pulkit Samrat Wedding Venue Revealed, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Kriti Kharbanda Marriage Venue: ప్రియుడిని పెళ్లాడనున్న కృతి కర్బందా.. వేదిక ఫిక్స్!

Published Mon, Mar 11 2024 8:46 PM

Kriti Kharbanda and Pulkit Samrat Wedding Venue Revealed - Sakshi

మరికొద్ది గంటల్లో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి పీటలెక్కనుంది. తీన్‌మార్, ఒంగోలు గిత్త, బ్రూస్‌లీ సినిమాలతో మెప్పించిన కృతి కర్బందా తన ప్రియుడితో ఏడడుగులు వేయనుంది. ఇప్పటికే పెళ్లి తేదీని ప్రకటించిన భామ.. మంగళవారం మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనుంది. రెండేళ్లుగా తన ప్రియుడు పుల్కిత్ సామ్రాట్‌తో డేటింగ్‌లో ఉన్న ముద్దుగుమ్మ వాలైంటైన్స్ డే సందర్భంగా పెళ్లి గురించి హింట్ ఇచ్చింది. 

వీరి గ్రాండ్ వెడ్డింగ్ హర్యానాలోని మానేసర్‌లో జరగనుంది. ఐటీసీ గ్రాండ్ భారత్‌లో వీరి వివాహానికి వేదికగా నిలవనుంది. వీరి ఇరువురి కుటుంబాలు ఢిల్లీకి చెందినవారు కావడంతో అనువుగా ఉండేందుకు మానేసర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కృతి, పుల్కిత్ జంటగా 'వీరే కి వెడ్డింగ్', 'తైష్', 'పాగల్పంటి' చిత్రాలలో కనిపించారు. కాగా.. పుల్కిత్‌కి గతంలోనే శ్వేతా రోహిరా అనే ‍అమ్మాయితో వివాహమైంది. ఈ జంట 2015లోనే విడిపోయారు. 

కాగా.. బోణి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి కర్బందా. ఆ తర్వాత అలా మొదలైంది, తీన్‌మార్, ఒంగోలు గిత్త, బ్రూస్‌లీ సినిమాలతో మెప్పించింది. అంతే కాకుండా బాలీవుడ్‌ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ముద్దుగుమ్మ చివరిసారిగా 14 ఫేరే చిత్రంలో కనిపించింది. తాజాగా కృతి నటించిన రిస్కీ రోమియో చిత్రం మే నెలలో విడుదల కానుంది.   కాగా.. పుల్కిత్ ఇటీవలే ఫుక్రే-3 చిత్రంలో కనిపించారు.

Advertisement
 
Advertisement