Kovai Sarala Sembi In OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న కోవై సరళ మూవీ.. ఎప్పటినుంచంటే?

Kovai Sarala Sembi Movie OTT Release Date Out - Sakshi

లేడీ కమెడియన్‌, సీనియర్‌ నటి కోవై సరళ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సెంబి. తంబిరామయ్య, అశ్విన్‌ కుమార్‌, బేబి నీలా, నాంజిల్‌ సంపత్‌, ఆండ్రూస్‌, పళ కరుప్పయ్య, ఆకాశ్‌, భారతీ కన్నన్‌ ముఖ్యపాత్రల్లో నటించారు. ప్రభు సాల్మన్‌ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీ డిసెంబర్‌ 30న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 3 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు హాట్‌స్టార్‌ అధికారిక ప్రకటన చేసింది.

కథేంటంటే..
అటవీ ప్రాంతంలో మనవరాలితో ఒంటరిగా జీవిస్తున్న భామ(కోవై సరళ) తేనె అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. ఆమె మనవరాలిపై ఓ రాజకీయ నాయకుడి కొడుకు, తన స్నేహితులతో కలిసి సామూహిత అత్యాచారం చేస్తాడు. దీంతో ఆ బామ్మ తన మనవరాలికి న్యాయం కోసం పోరాడుతూ అతడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. 

చదవండి: పిల్లగాలి అల్లరి అంటూ తండ్రి పాటకు స్టెప్పులేసిన సితార

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top