
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజా వారు రాణి గారు, ఎస్‌ఆర్ కల్యాణమండపం, సెబాస్టియన్ పీసీ 524 చిత్రాలతో అలరించిన కిరణ్ హీరోగా మరో సినిమా తెరకెక్కనుంది.
Kiran Abbavaram Nenu Meeku Baga Kavalsina Vadini Final Schedule: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజా వారు రాణి గారు, ఎస్‌ఆర్ కల్యాణమండపం, సెబాస్టియన్ పీసీ 524 చిత్రాలతో అలరించిన కిరణ్ హీరోగా మరో సినిమా తెరకెక్కనుంది. కోడి రామకృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని'. ఈ సినిమాకు ఎస్‌ఆర్ కల్యాణమండపం డైరెక్టర్ శ్రీధర్ గాదే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో కిరణ్ అబ్బవరం మాస్ లుక్‌లో అందర్ని ఆకట్టుకుంటాడని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీకి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా ఆడియోను లహరి మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లోకి తీసుకురానున్నారు. 'కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం చివరి షెడ్యూల్ రామోజీ ఫిలీం సిటీలో జరుగుతుంది. మరికొన్ని రోజుల్లో మూవీ షూటింగ్ పూర్తికానుంది.' అని దర్శకనిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.
చదవండి: డ్రగ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు.. పార్టీ లోపలి వీడియో వైరల్..