‘పఠాన్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత హీరో షారుక్ ఖాన్, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రానికి ‘కింగ్’ అనే టైటిల్ ఖరారైంది. ఆదివారం (నవంబరు 2) షారుక్ ఖాన్ బర్త్ డే సందర్భంగా ఈ టైటిల్ ప్రకటన వీడియోను రిలీజ్ చేశారు.
‘ఎంత మందిని చంపానో గుర్తు లేదు’, ‘వాళ్లు మంచివారా? చెడ్డవారా అని నేను అడగలేదు’, ‘వాళ్ల కళ్లలో నాకు భయం కనిపిస్తే అదే వారి ఆఖరి శ్వాస అవుతుంది’, ‘ఇట్స్ షో టైమ్’ అనే డైలాగ్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్‌గా, షారుక్ తనయ సుహానా కీలక పాత్ర చేస్తున్నారు.


