ఆ రోజు ఏది తినాలపిస్తే అది తింటా.. తాగుతా...: నాగార్జున | King Nagarjuna Share Diet Secrets and Gives Tips For Fitness | Sakshi
Sakshi News home page

Nagarjuna Akkineni: ఆ రోజు ఏది తినాలపిస్తే అది తింటా, తాగుతా.. నేను నమ్మే ఫిట్‌నెస్‌ మంత్రమిదే!

Jan 9 2025 6:17 PM | Updated on Jan 9 2025 6:29 PM

King Nagarjuna Share Diet Secrets and Gives Tips For Fitness

టాలీవుడ్‌ స్టార్‌ హీరో, కింగ్‌ నాగార్జున (Nagarjuna Akkineni) ఈ ఏడాది 66వ ఏట అడుగుపెడుతున్నారు. అయినా తెరపై తన వయసులో సగం లాగా కనిపిస్తారు. సిసలైన ఫిట్‌నెస్‌కు అసలైన చిరునామాలా కనిపించే నాగ్‌.. ఆరోగ్యకరమైన జీవనశైలి దీనికి కారణంగా చెప్పొచ్చు. తాజాగా ఆంగ్ల పత్రిక హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున తన ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌తో పాటు ఆరోగ్యార్ధుల కోసం పలు సూచనలు కూడా అందించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...

ఉదయం వ్యాయామం..
నిద్ర లేవగానే వర్కవుట్‌ చేయడమే నా మొదటి ప్రాధాన్యత. ఖచ్చితంగా వారానికి ఐదు రోజులు, వీలైతే ఆరు రోజులు వర్కవుట్‌ చేస్తాను.  ఉదయం పాటు 45 నిమిషాల నుంచి ఒక గంట వరకు వ్యాయామం చేస్తాను. ఇలా  వారానికి ఐదు నుంచి ఆరు రోజులు ఉదయం దాదాపు గంటసేపు వ్యాయామం చేస్తా. ఆ గంటలో స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్,  కార్డియో వర్కవుట్స్‌ మేళవిస్తా.  గత 30–35 సంవత్సరాలుగా నా రొటీన్‌ ఇదే. కాబట్టి స్థిరత్వం  ఎక్కువ. నేను రోజంతా చురుకుగా ఉంటాను. నేను జిమ్‌కి వెళ్లలేకపోతే, కనీసం వాకింగ్‌ లేదా ఈత కొట్టడానికి అయినా వెళ్తాను. ఫిట్‌ బాడీ మాత్రమే కాదు సౌండ్‌ మైండ్‌ని నిర్వహించడానికి ఈత కొట్టడం  గోల్ఫ్‌ ఆడటం వంటి కార్యకలాపాలను ఆస్వాదిస్తా. 

డైట్‌..
నా ఆహారం కొన్ని సంవత్సరాల నుంచి మారిపోయింది.  ఉదయం 7 గంటలకు వ్యాయామంతో ప్రారంభిస్తా. నా ఉదయపు దినచర్య లో ప్రోబయోటిక్స్‌ కూడా భాగం, ఇది గట్‌ ఆరోగ్యాన్ని పెంచడానికి  శక్తివంతంగా రోజు గడిపేందుకు ఇది గొప్ప మార్గం. దీని కోసం‘నా దగ్గర కిమ్చి, సౌర్‌క్రాట్, పులియబెట్టిన క్యాబేజీ వంటి కొన్ని సహజమైన ప్రోబయోటిక్స్‌ ఉంటాయి.  నేను కొంచెం గోరువెచ్చని నీరు  కాఫీ తాగి వ్యాయామానికి వెళతాను.  రాత్రి 7 గంటలకు లేదా గరిష్టంగా 7.30 గంటలకు నా డిన్నర్‌ పూర్తి చేస్తాను. 

నేను అడపాదడపా ఉపవాసం చేస్తాను. ప్రతిరోజూ 14 గంటల ఉపవాసం ఉంటుంది, నేను సాయంత్రం నుంచి మరుసటి ఉదయం వరకు రోజుకు కనీసం 12 గంటలు ఉపవాసం ఉంటాను. జీర్ణక్రియకు అది శ్రమను తగ్గిస్తుంది. ఆదివారం నా ఛీటింగ్‌ డే. ఆ రోజున  నాకు ఇష్టమైన ఫుడ్‌ని  ఆస్వాదిస్తాను.  ముఖ్యంగా హైదరాబాదీ వంటకాలు బిర్యానీ కూడా లాగించేస్తా. ఆ రోజున నాకు ఏది తాగాలనిపిస్తే అది తిని తాగుతాను. నేను దాని గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించను. ఇలా చేయడం వల్ల మనం దేన్నీ కోల్పోతున్నట్టు మనకు అనిపించదు.  

(చదవండి: Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ని వదలని సినిమా కష్టాలు!)

గోల్ఫ్‌తో మానసిక స్పష్టత
శారీరకంగానే కాదు మానసికంగానూ చురుకుగా ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం.  మానసిక ఆనందం కోసం కొంచెం సేపు గోల్ఫ్‌ ఆడతాను. ఈ గేమ్‌ను సరిగ్గా ఆడటానికి ఏకాగ్రత స్థాయిలు చాలా ఎక్కువ కావాలి. అది మన మనస్సును చాలా చురుకుగా ఉంచుతుంది.

నాగ్‌ సూచనలు
చాలా మందికి, ఆ వ్యాయామాన్ని మానేయడానికి ఎప్పుడూ ఒక సాకు అందుబాటులో ఉంటుంది. అలా ఆలోచించొద్దు. ఫలితం కనిపించాలంటే సమయం, శ్రమ పెట్టాల్సిందే. వర్కవుట్‌ చేయడం వల్ల  శారీరక లాభాలే కాదు అంతకు మించిన ప్రయోజనాలు ఉన్నాయి.
 మీ వ్యాయామాల మధ్య ఎక్కువ విశ్రాంతి తీసుకోకండి, కూర్చోవద్దు, వర్కవుట్‌ చేసే చోటుకి ఫోన్స్‌ తీసుకెళ్లవద్దు. ఏకాగ్రతతో  మీ హార్ట్‌ బీట్‌ ఒక నిర్దిష్ట స్థాయి కంటే ఎక్కువగా ఉందని నిర్ధారించుకోండి. నేను నమ్ముతున్న (ఫిట్‌నెస్‌) మంత్రం స్థిరత్వం. మీ శరీరానికి ప్రతిరోజూ ఒక గంట నుంచి 45 నిమిషాల సమయం ఇస్తే సరిపోతుంది.  నిద్ర (తగినంత) నీటితో ఎప్పుడూ హైడ్రేట్‌ చేయడం మర్చిపోవద్దు.

 మీరు 30 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు మీ శరీరం ఏమి చేయగలదో అదే పని ఇప్పుడు చేయలేదు. దానికి అనుగుణంగా ఆహారంలో మార్పు చేర్పులు చేయాలి.
–’ఆరోగ్యకరమైన అల్పాహారం, లంచ్‌ తినండి కానీ డిన్నర్‌తో జాగ్రత్తగా ఉండండి’ ఇది మీ ఆహారం  జీవనశైలిని ట్రాక్‌ చేస్తుంది.  చాలా మంది భారతీయులకు ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత డైరీ ఉత్పత్తులు నప్పవు. అలాగే బ్రెడ్, రోటీ తదితర కొన్నింటిలో కనిపించే గ్లూటెన్‌ కూడా. ఈ రెండూ, మీరు ఆపివేస్తే, సమస్యలు సగం పరిష్కారమవుతాయి. చాక్లెట్లు , స్వీట్స్‌ మాననక్కర్లేదు. అయితే మనకు ఇతర ఆరోగ్య సమస్యలు లేనప్పుడు వర్కవుట్‌ చేసినంత కాలం వాటి వల్ల నష్టం లేదు.

 షేప్‌ని పొందడానికి  ఎక్కువ కేలరీలు బర్న్‌ చేయడానికి ‘కొంతకాలం క్రితం ఒక శిక్షకుడు నాకు నేర్పించిన ఒక పాఠం.. అది కార్డియో లేదా శక్తి శిక్షణ అయినా, హృదయ స్పందనను మీ గరిష్ట రేటులో 70 శాతం కంటే ఎక్కువగా ఉంచుకోండి అనేది. అది రోజంతా మీ జీవక్రియను సమర్ధవంతంగా ఉంచుతుంది.

చదవండి: స్నేహితుడు పోయిన దుఃఖంలో నటుడు.. 'ఆ వెధవ ఆత్మకు శాంతి అక్కర్లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement