చెర్రితో మూవీ.. భారీగా రెమ్యూనరేషన్‌ పెంచిన కియారా, ఎంతంటే!

Kiara Advani Demands Rs 5 Crore For RC 15 Movie - Sakshi

‘భరత్‌ అనే నేను’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ. అటూ బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతూనే ఇటూ తెలుగులోనూ ఆఫర్లు కొట్టేస్తుంది ఈ భామ. తెలుగులో తన రెండవ చిత్రం రామ్‌ చరణ్‌ సరసన నటించిన కియారా మరోసారి చెర్రితో జతకడుతున్న సంగతి తెలిసిందే. శంకర్‌-రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో ఆర్‌సీ 15 మూవీలో కియారా హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే ఈ సినిమాకు ఆమె భారీ మొత్తంలో పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆమె సాధారణంగా తీసుకునే రూ. 4 కోట్ల రెమ్యూనరేషన్‌ కంటే మరో కోటి పెంచి 5 కోట్లు డిమాండ్‌ చేసినట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఆమె అడిగినంత కాకుండా 4.50 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు చిత్రబృందం ఆమెను ఒప్పించిందని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ప్రస్తుతం కియారా రెమ్యూనరేషన్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. రామ్‌చరణ్‌ 15వ చిత్రంగా శంకర్‌ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై  భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాలో చెర్రీ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నాడు. ఈ మూవీకి తమన్‌ స్వరాలు అందించనున్నాడు. అయితే ఇందులో మరో స్టార్‌ హీరో కూడా నటించే అవకాశాలున్నట్లు సమాచారం. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top