అలిమేలు దొరికిందా?

Keerthy Suresh To Pair With Gopichand - Sakshi

దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘జయం, నిజం’ చిత్రాల్లో గోపీచంద్‌ విలన్‌గా నటించారు. తాజాగా గోపీచంద్‌ హీరోగా తేజ దర్శకత్వంలో ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘అలిమేలు మంగ వేంకటరమణ’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఇందులో గోపీచంద్‌ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు అని కొంతకాలంగా చర్చలు నడుస్తున్నాయి. చాలామంది హీరోయిన్ల పేరు వినపడ్డాయి కూడా. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తీ సురేశ్‌ నటిస్తారని తెలిసింది. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో సెట్స్‌ మీదకు తీసుకెళ్లాలని చిత్రబృందం భావిస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top