కమెడియన్‌కి జోడీగా కీర్తీ సురేష్‌..? | Keerthy Suresh in Movie with Comedian Vadivelu As Heroine | Sakshi
Sakshi News home page

Keerthy Suresh: కమెడియన్‌కి జోడీగా కీర్తీ సురేష్‌..?

Sep 21 2021 10:27 AM | Updated on Sep 21 2021 10:38 AM

Keerthy Suresh in Movie with Comedian Vadivelu As Heroine - Sakshi

అగ్రహీరోల సరసన సినిమాలు చేస్తూ, మరోవైపు లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో నటిస్తూ కీర్తీ సురేష్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇప్పుడు ఆమె కమెడియన్‌..

అగ్రహీరోల సరసన సినిమాలు చేస్తూ, మరోవైపు లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో నటిస్తూ కీర్తీ సురేష్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇప్పుడు ఆమె కమెడియన్‌ వడివేలు సరసన ‘నాయ్‌ శేఖర్‌ రిటర్న్స్‌’ అనే సినిమాలో నటించనున్నారని కోలీవుడ్‌ టాక్‌.

సురాజ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ‘నాయ్‌’ అంటే కుక్క అని అర్థం. శునకాల నేపథ్యంలో సాగే సినిమా కావడంతో ఈ టైటిల్‌ పెట్టారట. శేఖర్‌ పాత్రను వడివేలు చేయనుండగా ఆయన సరసన కీర్తి నటించనున్నారని భోగట్టా. అయితే ఇందులో వడివేలుకి జోడీ లేదని, సినిమాకి కీలకంగా నిలిచే కథానాయిక పాత్ర ఉందనీ, ఆ పాత్రనే కీర్తీ సురేష్‌ చేయనున్నారని మరో వార్త వినిపిస్తోంది. మరి.. వడివేలుకి జోడీగా కీర్తి కనిపిస్తారా? లేక కథకి కీలకంగా నిలిచే పాత్రలో కనబడతారా? అసలు ఈ సినిమాకి ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారా? అనేది వేచి చూడాల్సిందే.

చదవండి: ఊహించిందే జరిగింది.. చిరంజీవికి రాఖీ కట్టిన కీర్తి సురేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement