
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి పరిచయం అక్కర్లేదు. తనకంటే వయసులో చిన్నవాడైన విక్కీ కౌశల్ను పెళ్లాడింది. 2021లో వీరిద్దరు వివాహం బంధంలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఈ జంటపై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కత్రినా గర్భంతో ఉన్నారని చాలాసార్లు కథనాలొచ్చాయి. దీనిపై ఇప్పటివరకు ఎవరూ కూడా స్పందించలేదు.
అయితే ఈసారి ఏకంగా ఈ జంటపై మరో ప్రచారం మొదలైంది. వచ్చేనెలలోనే కత్రినా కైఫ్ బిడ్డకు జన్మనివ్వబోతున్నారని టాక్ నడుస్తోంది. వచ్చే నెల అంటే అక్టోబర్లో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారని సోషల్ మీడియాలో వైరలవుతోది. ప్రస్తుతం ఆమె మూడో త్రైమాసికంలో ఉన్నారని.. వచ్చేనెల లేదా నవంబర్లో బిడ్డకు స్వాగతం పలకనున్నారని నెట్టింట చర్చ మొదలైంది. కత్రినా ప్రసవం తర్వాత సుదీర్ఘంగా విరామం తీసుకోవాలని యోచిస్తోందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై ఈ జంట ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
రెండు నెలల క్రితం కత్రినా కైఫ్ ఓవర్‌సైజ్ షర్ట్‌లో కనిపించడంతో మరోసారి ప్రెగ్నెన్సీ రూమర్స్ వినిపించాయి. ఆ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే తమపై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలపై గతంలోనే విక్కీ కౌశల్ కూడా క్లారిటీ ఇచ్చారు. అలాంటిదేమీ లేదని.. ఏదైనా ఉంటే తామే స్వయంగా చెబుతామన్నారు. అంతేకాకుండా 'బ్యాడ్ న్యూజ్' ట్రైలర్ సమయంలో కూడా కత్రినా గర్భం ధరించారని రూమర్స్ వచ్చాయి. ఆ సమయంలో కూడా ఇలాంటి వార్తల్ని ఆయన ఖండించారు.
అయినప్పటికీ ఈ జంటపై పలు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితమే కత్రినా తన కాస్మెటిక్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో చూసిన నెటిజన్స్ మరోసారి ఆమె గర్భవతి అంటూ కామెంట్స్ చేశారు. తాజాగా వస్తోన్న కథనాలపై కత్రినా, విక్కీ కౌశల్ క్లారిటీ ఇస్తే కానీ ప్రెగ్నెన్సీ రూమర్స్కు చెక్ పడేలా కనిపించడం లేదు.
మరోవైపు విక్కీ కౌశల్ ఈ ఏడాది ఛావాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. విక్కీ ప్రస్తుతం రణబీర్ కపూర్, ఆలియా భట్తో కలిసి 'లవ్ అండ్ వార్' సినిమాలో నటిస్తున్నారు.
We got #VickyKaushal - #KatrinaKaif content today, but wait a minute….. are they expecting 👩🍼? pic.twitter.com/QrhZ1z5Xnf
— Bollywood Talkies (@bolly_talkies) July 30, 2025