Nikhil Siddharth’s Kartikeya 2 Movie Shooting Stopped Due To Snowstorm In Himachal Pradesh - Sakshi
Sakshi News home page

'కార్తికేయ 2' షూటింగ్‌కు సడన్‌ బ్రేక్‌!

Mar 25 2021 8:36 AM | Updated on Mar 25 2021 10:57 AM

Karthikeya 2 Movie Stalled Due To Snow In Himachal Pradesh - Sakshi

తాజా షెడ్యూల్‌ను హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిస్సులో ఆరంభించారు. అయితే అక్కడ మంచు ఎక్కువగా కురుస్తున్న కారణంగా..

మంచు ఎక్కువగా కురుస్తున్న కారణంగా ‘కార్తికేయ 2’ షూటింగ్‌కి బ్రేక్‌ పడింది. నిఖిల్, అనుపమా పరమేశ్వర్వన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘కార్తికేయ 2’. 2014లో వచ్చిన ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను చందూ మొండేటి డైరెక్ట్‌ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ గుజరాత్‌లో జరిగింది.

తాజా షెడ్యూల్‌ను హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిస్సులో ఆరంభించారు. అయితే అక్కడ మంచు ఎక్కువగా కురుస్తున్న కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ‘‘పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల షూటింగ్‌ను ప్రస్తుతానికి ఆపేశాం. త్వరలో ఈ లొకేషన్‌లోనే ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను షూట్‌ చేయబోతున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. కాలభైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాత.

చదవండి: లవర్‌ బాయ్‌ తరుణ్‌ రీఎంట్రీ, ఈ సారి..

Advertisement
 
Advertisement
Advertisement