Karate Kalyani Talks With Media After Missing, Note Issues - Sakshi
Sakshi News home page

Karate Kalyani: నేను ఎక్కడికీ పారిపోలేదు

May 16 2022 9:13 PM | Updated on May 17 2022 8:56 AM

Karate Kalyani Talks With Media After Missing, Note Issues - Sakshi

నటి కరాటే కల్యాణి అజ్ఞాతం వీడింది. యూట్యూబర్‌ శ్రీకాంత్‌తో వివాదం, పోలీసు కేసు అనంతరం ఆమె కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కల్యాణి సోమవారం సాయంత్రం మీడియా ముందుక వచ్చింది.

తాను పారిపోయే రకం కాదని,ఎక్కడికి పారిపోలేదని స్పష్టం చేసింది. తాను పాప తల్లిదండ్రులను తీసురావడాని వెళ్లానని చెప్పింది. అనంతరం తాను ఎవరిని దత్తత తీసుకోలేదని, తన తల్లి విజలక్ష్మి తనతో ఉండరని అందుకే ఆమెకు ఏం తెలియదు అని చెప్పింది. పిల్లలను అమ్ముకోవడం ఎవరైనా చూశారా? అని, ఒంటరి మహిళ అంటే అంతా చులకనా? అంటూ పైర్‌ అయ్యింది. ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రలను ఆమె మీడియాకు చూపించింది.  దీంతో వారు చిన్నారి దత్తతపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా చిన్నారి తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, పిల్లలను పోషించలేక కరాటే కల్యాణి వద్ద ఉంచినట్లు అతడు తెలిపాడు. 

తన ఇంట్లోనే ఉన్నామని, స్టింగ్‌ ఆపరేషన్‌ చేసుకోండి ఆమె వ్యాఖ్యానించింది. కాగా ప్రాంక్‌ పేరుతో ఆసభ్యవీడియోలు చేస్తున్నాడంటూ యూట్యూబర్‌ శ్రీకాంత్‌పై కరాటే కల్యాణి దాడి చేసిన సంగతి తెలిసిందే. నడిరోడ్డుపై అర్థరాత్రి విరిద్దరు కొట్టుకోవడం చర్చ దారితీసింది. దీంతో ఇద్దరి ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కరాటే కల్యాణి కనిపించకుండపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె అక్రమంగా చిన్నారి దత్తత తీసుకుందంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆదివారం చైల్డ్‌వెల్‌ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ వారు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. అంతేగాక చిన్నారి పాప దత్తతపై తమకు వివరణ ఇవ్వాలంటూ గతంలో ఆమెకు నోటిసులు ఇవ్వగా తాను స్పందించలేదని అధికారులు మీడియాకు తెలిపిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement