‘అల్లరి’ నరేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’. ‘పోలిమేర, పోలిమేర 2’ చిత్రాల ఫేమ్ డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించడంతోపాటు షో రన్నర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం ద్వారా నాని కాసరగడ్డ దర్శకునిగా పరిచయమవుతున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది.
భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘కన్నొదిలి... కలనొదిలి...’ అంటూ సాగే తొలి లిరికల్ వీడియో సాంగ్‌ని శుక్రవారం విడుదల చేశారు మేకర్స్. దేవ్ పవార్ సాహిత్యం అందించిన ఈపాటని హేషమ్ అబ్దుల్ వాహబ్‌పాడారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ‘హే.. కన్నొదిలి... కలనొదిలి కనుపాపే ఉంటుందా.., నిన్నొదిలి... నే కదిలి కాసేపైనా ఉంటానా..., నువు పిలిచే పిలుపోదిలి ఎవరేమన్నా వింటానా.., నిను గెలిచే దారొదిలి అడుగైనా వేస్తానా..., చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే.., గల్లా పట్టి తొయ్యకే... బెట్టు నువ్వు సెయ్యకే...’ అంటూ ఈపాట సాగుతుంది.


