చంద్రముఖి-2లో బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌? | Sakshi
Sakshi News home page

Kangana Ranaut : చంద్రముఖి-2లో బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌?

Published Tue, Nov 22 2022 8:54 AM

Kangana Ranaut To Be Part Of Raghava Lawrence Chandramukhi2 Film - Sakshi

తమిళ సినిమా: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడుగా నటించిన చంద్రముఖి చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా దానికి సీక్వెల్‌ చంద్రముఖి –2 రూపొందుతోంది. లారెన్స్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని చంద్రముఖి చిత్రం దర్శకుడు పి.వాసునే తెరకెక్కిస్తున్నారు. దీనికి మరకతమణి (కీరవాణి) సంగీతాన్ని అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఇందులో నటి రాధిక, వడివేలు, రవిమరియ, మనోబాల తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

హారర్ర్, థ్రిల్లర్‌ జానర్‌లో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్‌ ఇప్పటికే మైసూర్‌లో ఒక షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. అక్కడ లారెన్స్, రాధికపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా హైదరాబాద్‌లో చిత్రీకరణను జరుపుకుంటోంది. కాగా చంద్రముఖి 2 చిత్రంలో సంచలన బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ముఖ్యపాత్రను పోషించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

కాగా ఈమె 2008 ధామ్‌ ధూమ్‌ అనే చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో అగ్ర కథానాయకగా ఎదిగారు. చాలా గ్యాప్‌ తరువాత తమిళంలో ఇటీవల విడుదలైన తలైవి చిత్రంలో జయలలితగా నటించి ప్రశంసలు అందుకున్నారు. దీంతో చంద్రముఖి 2 చిత్రంలో ఎలాంటి పాత్రలో నటించనున్నారన్నది ఆసక్తిగా మారింది..

Advertisement
 
Advertisement
 
Advertisement